జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-396లో.. వీరు , ప్రీతీ వాళ్ళ బాబుని రౌడీలు కిడ్నాప్ చేస్తారు. గంగ ఆ రౌడీల వెంటపడుతుంది. రంగా జరిగిన విషయాన్ని రుద్రతో చెప్పగా ముగ్గురు కలిసి రౌడీలని పట్టుకోవడానికి వెళ్తారు. అదేసమయంలో రౌడీలు ఒక ఇంట్లో బాబుని ఉంచుతారు. గంగ ఒక ప్లాన్ వేస్తుంది.
గుడిలో ఉన్న మైక్ లో పోలీసు బండి సైరెన్ ఆడియో వినిపిస్తుంది. అది విని అక్కడే రౌడీలు భయపడతారు. ఆ తర్వాత రంగ పోలీసులాగా మాట్లాడతాడు. మేం ఇక్కడ ఏరియా అంతా చుట్టుముట్టాం..బాబుని మాకు అప్పగించండి అని రంగా పోలీసులాగా మాట్లాడతాడు. దాంతో రౌడీలు పారిపోవాలని చూస్తారు. ఇక అదే సమయంలో రుద్ర అక్కడికి వస్తాడు. రౌడీలని కొట్టి బాబుని తీసుకుంటాడు. మరోవైపు వీరు, ఇషిక నాటకం ఆడుతుంటారు.
అ కిడ్నాపర్స్ అడిగిన డబ్బుని ఇచ్చి నా బాబుని నేను కాపడుకునేవాడిని కానీ రుద్ర బావ ఆపేశాడు.. నా బాబుని ఇప్పుడు రిస్క్ లో పెట్టాడు.. నా బాబు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయాడనుకుంటా అని వీరు నటిస్తుంటాడు. అదంతా విన్న శకుంతల ఫుల్ కోపంగా .. రుద్ర.. రుద్ర.. రుద్ర.. ఏమైనా దేవుడా తీసుకురావడానికి అని కోపంగా అరుస్తుంది. ఫోన్ చేసాను అత్తయ్య కలవడం లేదని ఇషిక అంటుంది. దాంతో ప్రీతీ, శకుంతల ఏడుస్తారు. రౌడీలు పిల్లాడిని ఏం అయినా చేస్తారేమో అని ఇషిక అనగానే ప్రీతీ, శకుంతల ఇంకా టెన్షన్ పడతారు. అలాంటిదేం ఉండదు.. రుద్ర తీసుకొస్తానని చెప్పాడు కదా అని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Jayam Serial Today Episode 396m, Jayam Serial Zee Telugu, Jayam Today Episode October 11, Ganga Rudra Baby Kidnap Rescue]




