Home

»

Tv News

Bigg Boss 10 Telugu : ముఖేష్ పరువు తీసిన చరణ్.. ఏంట్రా నీ బాధ అంటూ త్రిగుణ్ పై వర్షిణి ఫైర్!

Sep 23, 2026 11:17AM

బిగ్ బాస్ తెలుగు 10 లో మూడో వారం నామినేషన్స్ లో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. కంటెస్టెంట్స్ మధ్య సాగిన గొడవలు పీక్స్ కి చేరాయి. ఒక్కరోజులో పూర్తవ్వాల్సిన నామినేషన్ ప్రక్రియ గొడవలతో రెండు రోజుల పాటు సాగింది. మంగళవారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్స్ మరింత రసవత్తరంగా మారాయి. చరణ్ ను ముఖేష్ నామినేట్ చేశాడు. నువ్వు మెచ్యూర్డ్ గా ఉంటావనుకున్నా.. గేమ్ లో చాలా లేట్ గా తీసుకుంటున్నావని కారణం చెప్పాడు. దీనికి చరణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. మీకు ఆ స్టార్ ప్లేయర్ అనేదే డిజర్వ్ కాదు. గేమ్ సీరియస్ గా తీసుకునే వాళ్లు బజర్ మోగిన తర్వాత రాయరు అని చరణ్ అన్నాడు.

 

నువ్వు అసలు అప్పుడు ఉన్నావా అని ముఖేష్ అడుగుతాడు. ఆడియన్ గా బయట నుండి చూశానని చరణ్ అన్నాడు. నువ్వు కంటెస్టెంట్ గానే పనికిరావు, ఆడియన్ గానే ఉండు పోమని ముఖేష్ అనగానే.. సరే నువ్వెళ్లి పడుకో, ఎప్పుడూ పడుకునే ఉంటావ్ కదా అంటూ చరణ్ పరువు తీశాడు.

 

అదే టైంలో వర్షిణిని నామినేట్ చేస్తూ షాలినీ "ముందుండి ఆడే ధైర్యం లేక వెనకాల ఉండి ఆడిస్తున్నారు" అని కామెంట్ చేసింది. మధ్యలో ముఖేష్ కల్పించుకోవడంతో "ఇది నా నామినేషన్, ముఖేష్ ఎందుకు? నువ్వు మాట్లాడలేవా?" అని షాలినీ నిలదీసింది. ఈ గొడవలోకి త్రిగుణ్ ఎంట్రీ ఇచ్చాడు. "నువ్వు, నేను ఆవకాయ్, మనల్ని నంచుకోకుండా ఎవరూ ఆడలేరు" అంటూ కామెంట్ చేయడంతో వాతావరణం మారిపోయింది. గేమ్ రూల్స్ గురించి త్రిగుణ్ మాట్లాడుతుంటే "ఏంట్రా నీ బాధ? ప్రతీ దానికి మధ్యలో దూరిపోతావ్" అంటూ వర్షిణి త్రిగుణ్ పై ఫైర్ అయ్యింది.

 

 

 

[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Bigg Boss Telugu Nominations, Charan, Mukesh Gowda, Shalini, Varshini, Trigun, Captaincy Task, Bigg Boss Telugu 10 Episode]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com