Home

»

Tv News

Bigg Boss 10 Telugu : బ్లూ టీమ్ వర్సెస్ రెడ్ టీమ్.. త్రిగుణ్ పై విరుచుకుపడ్డ రోహిత్, షాలినీ!

Sep 8, 2026 10:19AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో హౌస్ మేట్స్ హోదాను పొందడమే లక్ష్యంగా బిగ్ బాస్ మహా పరీక్ష పెట్టాడు. ఇందులో భాగంగా.. మీరు ఇంకా కంటెస్టెంట్లే, హౌస్ మేట్స్ కాలేదు. హై రిస్క్ నుంచి నో రిస్క్ కి తీసుకెళ్లే సత్తా ఉన్న ఇద్దరు నాయకుల్ని మీరు ఎంచుకోండి, రెండు జట్లుగా విడిపోండి అని బిగ్ బాస్ ఆదేశించడంతో హౌస్ లో మరోసారి హైడ్రామా మొదలైంది.

 

లీడర్ల ఎంపిక ప్రక్రియ మొదలవగానే హౌస్ రెండుగా చీలిపోయింది. అగ్నిపరీక్ష ద్వారా ఇంట్లోకి వచ్చిన కంటెస్టెంట్లు దాదాపు అందరు కలిసికట్టుగా రోహిత్ పేరును ప్రపోజ్ చేశారు. వారి ప్రకారం రోహిత్ గేమ్ వారు దగ్గరగా చూశారు.. అందుకే అతనికి సపోర్ట్ చేశారు. అందులో ఒక్క ఝాన్సీ మాత్రమే భిన్నంగా త్రిగుణ్ కి ఓటు వేసింది. మరోవైపు సెలెబ్రిటీ కేటగిరీలో వచ్చిన కంటెస్టెంట్లు రాం ప్రసాద్, త్రిగుణ్ పేర్లను చెప్పారు. ముఖ్యంగా త్రిగుణ్ స్వయంగా.. రాం ప్రసాద్ ని లీడర్ గా ఉండనివ్వండి అని చెప్పడంతో సెలెబ్రిటీ టీం ఓట్లన్నీ రాంప్రసాద్ వైపు మళ్లాయి. చివరకు లెక్కల్లో రోహిత్, రాంప్రసాద్ ఇద్దరు లీడర్లుగా నిలిచారు.

 

అయితే అసలు గొడవ ఫలితం తర్వాతే మొదలైంది. త్రిగుణ్ తన అసంతృప్తిని బయటపెడుతూ.. అగ్నిపరీక్ష టీమ్ అంతా ఒక గ్రూప్ గా కలిసి రోహిత్ కే ఓటేశారు‌‌.. ఇది పక్కా గ్రూపిజం, ఇది ఫెయిర్ కాదంటూ ఆరోపించాడు. ఒక్క ఝాన్సీ మాత్రమే నాకు ఓటేసింది, నేను ఝాన్సీకి వేశానని త్రిగుణ్ అనడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. త్రిగుణ్ కామెంట్స్ తో రెడ్ టీం సభ్యులు భగ్గుమన్నారు. షాలినీ, శ్రష్టి, చరణ్, అమన్, రోహిత్ అందరూ కలిసి త్రిగుణ్ మీదకు వచ్చారు. మేం రోహిత్ ఆట చూశాం.. అతని కష్టం తెలుసు అందుకే ఓటేశాం. మరి మీరు కూడా సెలెబ్రిటీలకే ఓట్లు వేసుకున్నారుగా దాన్ని మేం గ్రూపిజం అన్నామా అంటూ షాలినీ, శ్రష్టి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. దాంతో త్రిగుణ్ ఒంటరి అయినట్లు కనిపించాడు.చివరకు బిగ్ బాస్ జోక్యంతో గొడవ సర్దుమణిగింది. రాంప్రసాద్ బ్లూ టీమ్ కి లీడర్ గా, రోహిత్ రెడ్ టీమ్ కి లీడర్ గా అధికారికంగా ఫిక్స్ అయ్యారు. మొదటి రోజే లీడర్ల ఎంపికలోనే గ్రూప్ వార్ మొదలవ్వడంతో ముందు ముందు హౌస్ లో మరింత రచ్చ కన్ఫమ్ అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com