(4).webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొదటి రోజే ఇంట్లో బీభత్సం మొదలైంది. కంటెస్టెంట్లు ఇంట్లోకి అడుగుపెట్టిన మొదటి రోజే గొడవలతో హౌస్ హీటెక్కింది. ముఖ్యంగా రోహిత్ వర్సెస్ త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం హైలెట్ గా నిలిచింది.
బిగ్ బాస్ ఇచ్చిన వాటర్ కొట్టే టాస్క్ లో రోహిత్ సరిగ్గా పార్టిసిపేట్ చేయలేదని హౌస్ మేట్స్ అందరు పాయింట్ అవుట్ చేశారు. అదే విషయాన్ని త్రిగుణ్ పెద్ద ఇష్యూ చేస్తూ ప్రతి ఒక్కరి దగ్గర రోహిత్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. దీంతో రోహిత్ ని త్రిగుణ్ టార్గెట్ చేస్తున్నాడనే చర్చ మొదలైంది. రోహిత్ మాత్రం తన స్టాండ్ లోనే ఉన్నాడు. ఇక కిచెన్ ఏరియాలో కూడా చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ఝాన్సీ, వర్షిణి ఇద్దరూ కలిసి టీ పెడుతుంటే అమన్ వచ్చి వర్షిణితో ఫ్లర్ట్ చేస్తూ.. నువ్వు చేస్తే అద్భుతంగా ఉంటుంది అంటూ బిస్కెట్లు వేశాడు. బెడ్ రూంలో రాం ప్రసాద్, నరేష్, దేబ్జానీ ముగ్గురూ సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నారు. రామన్నా, నువ్వే ఈ ఇంట్లో జెన్యూన్ పర్సన్ అని దేబ్జానీ రాం ప్రసాద్ తో అనడం కనిపించింది.
తర్వాత హౌస్ డ్యూటీస్ విషయంలో పెద్ద గొడవే అయింది. కిచెన్ డిపార్ట్మెంట్, క్లీనింగ్, బాత్రూం క్లీనింగ్ అని డివైడ్ చేస్తున్న క్రమంలో సుధీర్ బాగా డిష్ వాష్ చేశాడని త్రిగుణ్ అనడంతో అక్కడ వాగ్వాదం మొదలైంది. మేం చేయలేమా? అయినా అది మేం నిర్ణయించుకుంటామని ముఖేష్, రోహిత్, సుధీర్, షాలినీ గొడవ పెట్టారు. మరోవైపు చపాతీలు చేస్తున్న త్రిగుణ్ దగ్గరికి షాలినీ వచ్చి కర్రీ గురించి అడిగింది. అది నా కేటగిరీ కాదని త్రిగుణ్ కాస్త అటిట్యూడ్ గా సమాధానం ఇవ్వడంతో .. అది మామూలుగా చెప్పొచ్చు కదా అని షాలినీ అంది. దీంతో ఆ ఇద్దరి మధ్య కూడా చిన్న గొడవ జరిగింది. మొత్తానికి మొదటి రోజే హౌస్ లో గ్రూపులు, గొడవలు మొదలయ్యాయి.




(4).webp)

