
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్ సీరియల్ పొదరిల్లు Podharillu . ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 204 లో.....జయంతి తన కండిషన్స్ చెప్తుంది. నేను పెళ్లి తర్వాత అడ్జస్ట్ కాలేను.. మీరేదో నేను పదహారేళ్ల అమ్మాయిని అనుకుంటున్నారా.. నా మొదటి భర్త నన్ను తక్కువ చేసి మాట్లాడాడు.. విడాకుల తర్వాత నన్ను ఎవరూ చేసుకోరని అన్నాడు. అందుకే అతని కంటే ముందే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని జయంతి తెగేసి చెప్పి వెళ్లిపోతుంది. దీంతో.. ఈవిడ మొదటి భర్త మీద పంతంతో రెండో పెళ్లి చేసుకుని మా అన్నయ్యని సాధిస్తుందా అని చక్రి షాక్ అవుతాడు.
ఇంట్లో శైలు డల్ గా ఉండటంతో సురేష్ కామెడీ చేస్తాడు. దీంతో కోపంగా రూంలోకి వెళ్లిన శైలు కేశవ్ కి ఫోన్ చేసి.. అప్పటి నుంచి ఎందుకు కాల్ చేయలేదు, నా గురించి పట్టించుకోవా అని నిలదీస్తుంది. ఎవరి జీవితం ఎలా పోయినా మన పెళ్లి అవ్వాలనుకోవడం స్వార్థం కాదా అని కేశవ్ అంటాడు. నేను నీకు ముఖ్యం కాదా అని శైలు అడిగి సారీ చెప్పమంటే అంత లేదని కేశవ ఫోన్ కట్ చేస్తాడు. ఇదంతా విన్న సురేష్.. మీరే విడిపోతున్నారని వెటకారం చేస్తాడు.
జయంతి గురించి ఎంక్వైరీ కోసం మహా, చక్రి ఆమె వీధికి వెళ్తారు. సూపర్ మార్కెట్ లో గోపికతో చక్రి ఓవర్ యాక్షన్ చేయడంతో మహా వస్తువులతో కొడుతుంది. ఆ తర్వాత ఎంక్వైరీలో.. ఆజన్మ బ్రహ్మచారి ఇంట్లోకి వెళ్లి పసుపు నీళ్లు చల్లుంచుకుని నవ్వుకుంటారు. చివరకు ఇస్త్రీ షాప్ లో .. జయంతి గయ్యాళి, ఆమె అమ్మ ఇంకా పెద్ద గయ్యాళి.. ఇంటిని ముక్కలు చేస్తుందని తెలియడంతో ఈ పెళ్లి ఆపాలని ఫిక్స్ అవుతారు.
చివరగా మాధవ్ పెళ్లి విషయం చెప్పడానికి భన్సీ ఇంటికి వెళ్తాడు. మనీషా సిగ్గుపడుతూ టీ తెస్తుండగా మాధవ్ పెళ్లి మాట వినగానే ఆమె చేతిలో గ్లాస్ జారిపోతుంది. మాధవ్ దూరమవుతాడన్న బాధతో మనీషా లోలోపల బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






