
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ లో టాప్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఈ సీరియల్ లో నర్మద పాత్రతో ఫుల్ పాపులర్ అయిన అన్షు రెడ్డి తాజాగా ఫేక్ న్యూస్ పై సీరియస్ అయింది. తన పేరుతో ఓ ఫేక్ ఇన్ స్టా పేజ్, ఫేస్ బుక్ పేజీలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని.. తను చనిపోయిందంటూ.. యాక్సిడెంట్ అయిందంటూ దారుణంగా పోస్టులు పెడుతున్నారని అన్షు ఆవేదన వ్యక్తం చేసింది. ఆ పోస్టులు చూసి ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.
ఈ నేపథ్యంలో అన్షు రెడ్డి తన ఒరిజినల్ ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టింది. ఇది ఫేక్ న్యూస్, నా పేరుతో ఉన్న ఆ పేజ్ ఫేక్, దయచేసి నమ్మకండి.. అందరు ఆ పేజ్ కి రిపోర్ట్ కొట్టండి అంటూ అలర్ట్ చేసింది. తన ఫొటోను వాడుకుని సానుభూతి కోసం, వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారని, తను ఆరోగ్యంగా, సేఫ్ గా ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు తనకు ఒక్కటే అఫీషియల్ పేజ్ ఉందని, మిగతావన్నీ ఫేక్ అని చెప్పింది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు రెండో కోడలు, లేడీ సింగం నర్మదగా అన్షు రెడ్డి యాక్టింగ్ కు మంచి క్రేజ్ ఉంది. చీరకట్టులో పద్ధతిగా కనిపిస్తూనే, అవసరమైతే అత్త వేదవతితో కలిసి ఫైట్ చేసే స్ట్రాంగ్ పాత్ర ఆమెది. అందుకే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి కొందరు ఇలా ఫేక్ పేజీలు పెడుతున్నారు. గతంలో కూడా సీరియల్ సెలబ్రిటీల పేరుతో ఇలాంటి ఫేక్ న్యూస్ లు వచ్చాయి.
అన్షు పోస్ట్ తర్వాత ఫ్యాన్స్.. అయ్యో మేము నిజమే అనుకున్నాం, థాంక్ గాడ్ నువ్వు సేఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సీరియల్ టీమ్ కూడా అన్షుకు సపోర్ట్ గా నిలుస్తోంది. అన్షు తల్లి బర్త్ డే పోస్ట్, బీచ్ లో షార్ట్ ఫొటోలు షేర్ చేసి రీసెంట్ గా వైరల్ అయింది. ఇప్పుడు ఫేక్ న్యూస్ పై స్పందించడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ అంతా కలిసి ఆ ఫేక్ పేజీని రిపోర్ట్ చేస్తున్నారు.






