
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 లోని ఏడో ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే.. శ్రీముఖి అందరికి రకరకాల మిర్చీలు పంచడం స్టార్ట్ చేసింది. అందరూ అయ్యో అంటూ ఉండగా, అమన్ మాత్రం వాటిని ఫుల్ గా తినేసి షాక్ ఇచ్చాడు. అసలు భయమే లేదు అన్నట్టు యాక్టివ్ గా కనిపించాడు. ఇక ఆ తర్వాత బెలూన్స్ ఊదే టాస్క్ లో దీపక్, సుమ, లయతో పాటు అమన్ కూడా ఉన్నాడు. ఈ టాస్క్ లో సుమకి కాటుక కంట్లో పడి ఆట ఆగిపోయింది. కానీ అమన్ లాస్ట్ వరకు ట్రై చేశాడు. గెలవలేకపోయినా ఎనర్జీ మాత్రం తగ్గించలేదు. ఏదో ఒకటి చేయాలన్న వైబ్ అతడిలో కనిపించింది.
అన్ని డేర్స్ అయ్యాక జడ్జ్ లు అమన్ ని డైరెక్ట్ గా టాప్-15 లోకి సెలెక్ట్ చేశారు. మాటలు తక్కువ కానీ యాక్షన్ ఎక్కువ అన్నట్టు ప్రూవ్ చేశాడు అమన్. ఇప్పుడు జనాల ఓట్ల మీదే అతడి ఎంట్రీ ఆధారపడి ఉంది. ఫుడ్ ఐటమ్స్ దగ్గర దూకుడు చూపించిన అమన్ ఇంట్లో ఎంత దూకుడు చూపిస్తాడో చూడాలి మరి.
మరోవైపు దీపక్ స్టైల్ ఏంటంటే అరుపులు లేవు, గొడవలు లేవు. సైలెంట్ గా వచ్చి టాస్క్ పూర్తి చేసి వెళ్ళిపోతాడు. లయ టాస్క్ కూడా పూర్తి చేయలేకపోయింది కానీ దీపక్ మాత్రం కూల్ గా విన్నర్ అనిపించుకున్నాడు. అందుకే జడ్జ్ ల దగ్గర మంచి మార్కులు పడ్డాయి. ఆ విన్ తోనే దీపక్ కి టాప్ 15 టికెట్ కన్ఫమ్ అయిపోయింది. ఇప్పటి వరకు పెద్దగా స్క్రీన్ టైం లేకపోయినా.. ఈ ఒక్క టాస్క్ తో గేమ్ లోకి స్ట్రాంగ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక నుండి దీపక్ నుండి ఇంకా ఏమేం చూస్తామో అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.





.webp)
