Home

»

Tv News

Agnipariksha Season 2 - 10th Episode: రాజకుమారి రివర్స్ కార్డ్ ట్విస్ట్, రోహిత్ కు ఎల్లో కార్డ్!

Aug 25, 2026 10:10AM

అగ్నిపరీక్ష పదో ఎపిసోడ్ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే యాంకర్ శ్రీముఖి రాజకుమారికి స్పెషల్ గా వార్నింగ్ ఇచ్చింది. నీ దగ్గర ఉన్న రివర్స్ ది డెసిషన్ కార్డ్ ను నువ్వు వాడాల్సిందే, దాన్ని వాడి జ్యూరీల నిర్ణయాన్ని మార్చలేవు, విన్నింగ్ ని మార్చలేవని ముందే క్లారిటీ ఇచ్చింది. అంటే కార్డ్ ఉంది కదా అని జ్యూరీ మాటను తిరగరాసేయలేవని ముందే లాక్ చేసేసింది.

 

అసలు రాజకుమారి ఈరోజు పెద్దగా గేమ్ ఆడలేదు. స్ట్రాంగ్, వీక్ టీమ్స్ విడగొట్టేటప్పుడు కూడా తను పెద్దగా హైలైట్ అవ్వలేదు. గెలిచిన వాళ్ళు వీక్ ఎవరో చెప్పేటప్పుడు తన పేరు కూడా వీక్ లిస్ట్ లోకి వచ్చేసింది. అంటే తోటి కంటెస్టెంట్స్ దృష్టిలో తను ఇంకా వీక్ కంటెస్టెంట్ గానే ఉందని అర్థమైంది.

 

మెయిన్ ఫిజికల్ టాస్క్ అయ్యాక అసలు ట్విస్ట్ మొదలైంది. రోహిత్ టీం గెలిచాక ఓట్ అప్పీల్ కోసం తన టీంలో బాగా ఆడిన శ్రుష్టి పేరు చెప్తాడు. అందరు శ్రుష్టికే వస్తుందని అనుకున్నారు. కానీ ఇక్కడే రాజకుమారి దగ్గర ఉన్న కార్డ్ పని చేసింది.

 

రోహిత్ శ్రుష్టికి ఓట్ అప్పీల్ ఇవ్వగానే రాజకుమారి వెంటనే తన దగ్గర ఉన్న రివర్స్ ది డెసిషన్ కార్డ్ ని వాడేసింది. దీంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. శ్రుష్టికి బదులుగా రాజకుమారి డైరెక్ట్ గా ఓట్ అప్పీల్ కి వెళ్ళిపోయింది. అంటే తను ఆడకుండానే, కార్డ్ పవర్ తో ఓట్ అప్పీల్ కొట్టేసింది. ఇది చూసి స్టేజ్ మీద ఉన్నవారంతా షాక్ అయ్యారు.

 

ఇక జ్యూరీల మధ్య కూడా ఈరోజు గట్టి డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా రోహిత్ రూల్ బ్రేక్ చేసినప్పుడు. తాడుని చేత్తో పట్టుకోవద్దని జ్యూరీ ముందే చెప్పినా రోహిత్ వినకుండా లాగేసి అందరిని కింద పడేశాడు. దీంతో జ్యూరీ మధ్యలోనే ఆట ఆపేసి మళ్ళీ రూల్స్ చెప్పాల్సి వచ్చింది. రోహిత్ తీరు మీద జ్యూరీ సీరియస్ అయ్యింది.

 

చివర్లో జ్యూరీ రెండు పెద్ద నిర్ణయాలు తీసుకుంది. ఒకటి MVP గా మళ్ళీ శ్రుష్టిని సెలెక్ట్ చేసి తనకు కూడా ఓట్ అప్పీల్ ఇవ్వడం. దీంతో శ్రుష్టి కూడా రాజకుమారితో పాటు సేఫ్ అయింది. రెండోది రూల్ బ్రేక్ చేసినందుకు రోహిత్ కి ఎల్లో కార్డ్ ఇవ్వడం. అలా రాజకుమారి తెలివిగా కార్డ్ వాడి ఓట్ అప్పీల్ తెచ్చుకుంటే, రోహిత్ మాత్రం తొందరపాటుతో ఎల్లో కార్డ్ తెచ్చుకున్నాడు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com