Home

»

Latest News

Ramayana: పార్ట్ 1 లో యష్ స్క్రీన్ టైమ్ ఇంతేనా: రావణుడిగా విశ్వరూపం తప్పదా! 

Sep 8, 2026 12:49PM


ఎంత బడా కట్ అవుట్ అయినా కంటెంట్ లేకపోతే బొమ్మ నడవడదనే నగ్న సత్యం రీసెంట్ గా 'టాక్సిక్' తో మరోసారి యష్ తో పాటు అందరికి అర్ధమయ్యింది. అందుకే 'కంటెంట్ ఈజ్ ఫస్ట్ కింగ్' అంటారు. అయితే  యష్ ఈ దీపావళికి నవంబర్ 6 న  'మైథలాజికల్ విజువల్ వండర్' ‘రామాయణ’ పార్ట్ 1 తోసెల్యులాయిడ్ పై ప్రత్యక్షం కానున్నాడు.

 ఈ సారి  లంకాధిపతి రావణుడిగా రావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.  రామాయణ స్టార్ట్ అయినప్పటి నుంచి యశ్ రోల్  నిడివిపై సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోను పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పార్ట్ 1 లో యశ్ కేవలం 15 నిమిషాల కేమియోగా కనిపిస్తాడని, పార్ట్-2లోనే పూర్తి స్థాయిలో సందడి చేస్తాడనే రూమర్స్ జోరుగా వినిపించాయి.  అయితే తాజాగా సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న  సమాచారం ప్రకారం పార్ట్-1'లోనే  యశ్ ఏకంగా  గంట కంటే ఎక్కువ సమయం సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలోనే రావణాసురుడి పాత్రకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలు, లంకేశ్వరుడి పరిచయం మరియు అతడి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ఘట్టాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయి. 

 

 

Also Read: ధురంధర్ రేంజ్ లో ఆ సౌత్ స్టార్ హీరో మూవీ: మరి ధురంధర్ రికార్డ్స్ గల్లంతేనా!


కేవలం చివరి నిమిషాల్లో వచ్చే ఒక చిన్న రోల్  కాకుండా, కథనానికి బలమైన పునాది వేసే విధంగా దర్శకుడు రావణుడి క్యారక్టర్ ని గంటకి  పైగా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారని సమాచారం.   కథ ప్రధానంగా శ్రీరాముడి అయోధ్య ప్రయాణం, అరణ్యవాసం మరియు సీతాపహరణం చుట్టూ తిరుగుతుంది. అయితే రావణాసురుడి ఘనతను, అతని శక్తులను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి దాదాపు 60 నిమిషాలకు పైగా నిడివి కేటాయించడం యశ్ అభిమానులకు నిజంగా ఒక గొప్ప శుభవార్తే. యశ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం తెలిసిందే. కనివిని ఎరుగని  భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణలో శ్రీరాముడిగా  రణబీర్ కపూర్,సీతమ్మ వారుగా సాయి పల్లవి కూడా మెస్మరైజ్ చేయనున్నారు. నితేష్ తివారీ దర్శకుడు కాగా నమిత్ మల్హోత్రా నిర్మాత. 

 

 

[ Yash, Ramayana Part 1, Ravanasurudu, Ravana Screen Time, Ranabir kapoor, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com