
ఈ వారం థియేటర్లలో సరికొత్త సినిమాల జాతర మొదలుకాబోతోంది. పలు క్రేజీ సినిమాలు థియేటర్లలోకి దూసుకొస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్, స్పై యాక్షన్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, మైథలాజికల్ థ్రిల్లర్.. ఇలా విభిన్న జానర్ సినిమాలు ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి.
తమిళ్ హీరో కార్తీ 'సర్దార్ 2'తో మళ్లీ రచ్చ చేయడానికి సిద్ధమైపోయారు. పి.ఎస్. మిత్రన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మోస్ట్ ఎవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 10న మన ముందుకు వస్తోంది. మొదటి పార్ట్ 'సర్దార్' ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇక ఈ సీక్వెల్ లో యాక్షన్ విజువల్స్, హై-వోల్టేజ్ ట్విస్టులు మైండ్ బ్లోయింగ్ గా ఉండబోతున్నాయి. స్పై థ్రిల్లర్స్ ప్రేమికులకు ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ఐ ఫీస్ట్ కానుంది.
టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ విలన్ గా నటించిన తమిళ్ మూవీ 'మండాడి', మాస్ మహారాజా రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతీరాజు డెబ్యూ రూరల్ యాక్షన్ మూవీ 'మారెమ్మ' సెప్టెంబర్ 10న సందడి చేయనున్నాయి.

యూత్ ని అలరించడానికి 'బేబీ' కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'. '90s' ఫేమ్ ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేసిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 11న విడుదలవుతోంది. లండన్ లో చదువుకోవడానికి వెళ్లిన ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి లైఫ్, అక్కడ చిగురించిన లవ్, ఆ తర్వాత వచ్చే బ్రేకప్ ఎమోషన్స్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. బేబీ లాగే ఈ సినిమా కూడా కుర్రకారుని మెస్మరైజ్ చేస్తుందని మూవీ టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.
సుమంత్ డిఫరెంట్ అటెంప్ట్ గా వస్తున్న డివైన్ మిస్టరీ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి' సెప్టెంబర్ 11న వస్తుండగా, పంజాబీ కామెడీ ప్రియుల కోసం 'సింగ్ వర్సెస్ కౌర్ 2' కూడా రేసులో ఉంది.
బాలీవుడ్ ని కుదిపేయడానికి వస్తున్న బిగ్ మూవీ 'హైవాన్'. సుమారు 18 ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ప్రియదర్శన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ ఒక బ్లైండ్ మార్షల్ ఆర్టిస్ట్ గా నటిస్తుంటే.. అక్షయ్ కుమార్ మోస్ట్ డేంజరస్ అండ్ రూర్లెస్ సైకో కిల్లర్ గా కనిపించబోతున్నారు. ఒక చిన్న పాపని కాపాడటానికి ఒక కంటి చూపు లేని యోధుడు, ఆ సైకోతో ఎలాంటి పోరాటం చేశాడు అనేదే ఈ మూవీ మెయిన్ పాయింట్.
ఇక సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారి కోసం హాలీవుడ్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సీక్వెల్ 'ఫాల్ 2: డెడ్ పాయింట్'. 2022లో వచ్చిన 'ఫాల్' సినిమా థియేటర్లలో మనల్ని ఏ రేంజ్ లో భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దానికి కంటిన్యుయేషన్ గా వస్తున్న ఈ సీక్వెల్ సెప్టెంబర్ 11న థియేటర్లలోకి వస్తోంది. థాయ్‌లాండ్ లోని నిటారుగా ఉండే ఒక ప్రాణాంతకమైన పర్వతంపై చిక్కుకున్న ఇద్దరు యువతులు.. బతకడానికి చేసే ఊపిరిసలపని సర్వైవల్ ఫైట్ ఈ సినిమా.
డిఫరెంట్ జోనర్స్ తో ఈ వారం థియేటర్లు కలర్‌ఫుల్ గా కళకళలాడబోతున్నాయి. మరి వీటిలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి.
[This Week Releases, Epic First Semester, Sardar 2 Movie, Mahendragiri Varahi, Maremma Movie, Mandaadi Movie, Telugu Film News, Telugu News]






