
ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ల ద్వారా విష్ణుప్రియ, అనన్య నాగళ్ళ నెలకి లక్షలకి లక్షలు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. మరి తాడిని తన్నే వాళ్ళుంటే తలని తన్నే వాళ్ళు ఉంటారనే కోణంలో ఆ ఇద్దర్ని మించి తన అందచందాలతో ఒక ముద్దుగుమ్మ లక్షల రూపాయలని సంపాదిస్తుంది. మరి ఆ ముద్దుగుమ్మ, సుగుణుల రాశి వివరాలు చూద్దాం.
వృత్తిక పటేల్(vrutika patel)..అందానికి వెన్నపూస కలిపినంత సుతిమెత్తని సౌందర్య వతి. ముట్టుకుంటే కందిపోయేంత అందం. తను మనతో మాట్లాడుతుంటే చూపు కూడా పక్కకి తిప్పుకోలేం. రంభ, ఊర్వశి మేనక కూడా చాలరు. ఈ విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రన్ అవుతున్న వృత్తికప్రొఫైల్‌ను చూస్తే ఎవరైనా సరే ఆమెని ఒక మోడల్ లేదా ఇన్‌ఫ్లుయెన్సర్ అని నమ్ముతారు. ట్రెండీ డ్రెస్సులు, అందమైన లోకేషన్లు, రీల్స్‌తో ఆమె ఖాతా కళకళలాడుతుంటుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే.. వృత్తిక పటేల్ అనే అమ్మాయి నిజంగా లేదు. ఇది పూర్తిగా AI టెక్నాలజీతో సృష్టించిన ఒక బొమ్మ.కొంత మంది అపరమేధావులు వృతిక పటేల్ పేరుతో నిర్వహిస్తూ, టెక్నాలజీ సాయంతో ఫోటోలు, వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు.
వృత్తిక పటేల్ ఖాతాకు ప్రస్తుతం లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే కేవలం ఫాలోవర్లే కాదు, కంటెంట్ కోసం డబ్బులు చెల్లించే 'సబ్‌స్క్రిప్షన్' మోడల్ ని కూడా ఈ ఖాతా రన్ చేస్తోంది. దాదాపు 300 మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉండగా ఒక్కో యూజర్ నెలకు దాదాపు 390 రూపాయల నుండి 399 వరకు చెల్లిస్తున్నారు.
ఈ లెక్కన చూస్తే, కేవలం సబ్‌స్క్రిప్షన్ల ద్వారానే నెలకు దాదాపు 1,19,700 ఆదాయం వస్తోంది. ఇది కాకుండా బ్రాండ్ ప్రమోషన్లు, ఇతర యాడ్స్ ద్వారా వచ్చే సంపాదన అదనం. విష్ణుప్రియ వంటి వారు నిజమైన వ్యక్తులు కాబట్టి వారిపై ట్రోల్స్ లేదా కేసులు వచ్చాయి. కానీ వృత్తిక పటేల్ లాంటి AI ఖాతాలను ఎవరు నడుపుతున్నారో తెలియదు కాబట్టి, సబ్‌స్క్రిప్షన్ల పేరుతో డబ్బులు చెల్లించే అబ్బాయిలు మోసపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
aslo read: Payal rajput: ఏడ్చుకుంటూ వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్.. అసలు నిజం ఇదే
వృత్తిక పటేల్ ఉదంతం చూస్తుంటే భవిష్యత్తులో సోషల్ మీడియా రంగం ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం పనిముట్టుగానే కాకుండా, మనుషుల ఆదాయ వనరులను దెబ్బతీసేలా ఎదుగుతోంది. ఫోటోలు చూసి, రీల్స్ చూసి మోసపోకుండా.. మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు, ఎవరికి డబ్బులు చెల్లిస్తున్నారు అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. టెక్నాలజీ అద్భుతమే కానీ, అది మన విచక్షణను మించిపోకూడదు. ఏది ఏమైనా వృత్తిక పటేల్ ఏఐ బొమ్మ అని తెలిసిన ఆమె అభిమానులు దేవదాసులుగా మారిపోయి మాటి మాటికీ ఆమెనే చూస్తూ ఏఐ నే నిజమైన వృత్తికని ఇన్ స్టాగ్రామ్ లోకి పంపిస్తే ఎంత బాగుండనే వేదనలో ఉన్నారు.







