Home

»

Latest News

Payal rajput: ఏడ్చుకుంటూ వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్.. అసలు నిజం ఇదే 

Apr 29, 2026 9:34AM

 

ఆర్ఎక్స్ 100 , మంగళవారం మూవీతో  తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి పాయల్ రాజ్‌పుత్(Payal Rajput).కొంత గ్యాప్ తర్వాత 'ఫస్ట్ టైమ్ 01.01.01(First Ttime)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సదరు ఈవెంట్ లో పాయల్ మాట్లాడుతూ ఫుల్  ఎమోషనల్ అయింది. ఈవెంట్ మధ్యలోనే స్టేజ్ కూడా దిగి వెళ్లిపోయింది. ఆ డిటైల్స్ ఏంటో చూద్దాం.
  

 ఈ వేడుకలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి పాయల్ సమాధానమిస్తు మా నాన్న క్యాన్సర్ బారిన పడటంతో  మా కుటుంబానికి అత్యంత కష్ట కాలంగా మారింది. ఒకవైపు ఆయన అనారోగ్యం, మరోవైపు మానసిక వేదన నన్ను చుట్టుముట్టాయి. నా బెస్ట్ క్రిటిక్ నాన్నే  ఆర్ఎక్స్ 100 చూసి ఎంతో మెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి చనిపోయి ఏడాది కావస్తోంధీ ఆ ఒత్తిడిని భరించలేకే  జైపూర్‌లో 'విపాసన' ట్రీట్‌మెంట్ కోసం వెళ్ళాను. అక్కడి ధ్యానం, చికిత్స నాకు కొంచెం ఊరటనిచ్చాయి" అని మాట్లాడుతుండగానే ఆమె  గొంతు మూగబోయింది. తన తండ్రి పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయానని వెక్కి వెక్కి ఏడ్చింది.   

also Read:  ఆల్ ఈజ్ వెల్.. 3 ఇడియట్స్ సీక్వెల్‌ కన్ఫర్మ్ చేసిన అమీర్ ఖాన్

పాయల్ ఉద్వేగానికి లోనవడంతో పక్కనే ఉన్న మూవీ టీమ్, హీరో ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ తన తండ్రి జ్ఞాపకాలు, ఆ బాధాకరమైన రోజులను తలచుకుని ఆమె నియంత్రణ కోల్పోయారు. తన మనసు కలత చెందడంతో ఇక ఏమాత్రం అక్కడ ఉండలేనని చెబుతూ.. కన్నీళ్లు తుడుచుకుంటూనే వేదికపై నుండి మధ్యలోనే వెళ్ళిపోయారు. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com