Home

»

Latest News

సీఎం విజయ్‏ని కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక: ఆ హీరో ట్వీట్ వైరల్!

Oct 13, 2026 12:38PM

 

హిట్ ఫెయిర్ గా ఫ్యాన్స్, ప్రేక్షకుల చేత కితాబు అందుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ నెల 16 న 'రణబాలి' తో సెల్యులాయిడ్ పై అడుగుపెట్టనున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో విజయ్, రష్మిక క్షణం తీరిక కూడా లేకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ క్రేజీ అఫీషియల్ జోడీ చెన్నైలో పర్యటించింది. ఈ సందర్భంగా  తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్)ని  మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం అయిన తర్వాత విజయ్‌ను ఈ జంట ప్రత్యేకంగా కలవడం ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ పిక్స్ క్షణాల్లో వైరల్ అయ్యాయి.  ఈ అరుదైన భేటీ గురించి విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ నోట్ పంచుకున్నారు. "దళపతి విజయ్ గారితో  చాలా అద్భుతమైన సమయం గడిపాను. ఒక బిజీ షెడ్యూల్ మరియు సుదీర్ఘమైన పనిదినం తర్వాత కూడా ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమతో స్వాగతించారు. జీవితం, పనితీరు మరియు ప్రపంచం గురించి ఆయన తన వ్యక్తిగత అంతర్దృష్టులను మాతో పంచుకున్నారు. కేవలం ఒక్క భేటీతోనే ఆయన నాకు మరింత ఇష్టమైన వ్యక్తిగా మారిపోయారు" అంటూ విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ పోస్ట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇది కూడా చదవండి: రజినీకి ఆ హీరోయిన్ తో కలిసి నటించాలని ఉందంట: భయంతో వణికిపోతున్న హీరోయిన్! 

 

 

విజయ్ తో  రష్మిక  'వారిసు' (వారసుడు )లో జోడిగా విషయం తెలిసిందే. ఆ చిత్రంలోని రంజితమే సాంగ్ కి నేటికీ డాన్స్ చేసే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఇక  రణబాలిని  పాన్ ఇండియా నెంబర్ వన్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా రాహుల్ సంకృతి యన్ దర్శకుడు.   

 

[Vijay Deverakonda ANd Rashmika Meet Cm Vijay, Vijay Deverakonda, Rashmika Mandanna, Tamil Nadu CM Vijay, Ranabaali movie, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com