Home

»

Latest News

నాని సరసన ఎన్టీఆర్ బ్యూటీ: ఫ్యాన్స్ లో పెరిగిన అంచనాలు! 

Oct 13, 2026 1:01PM

రీసెంట్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ కనుక నిజమైతే అభిమానులు, సినీ ప్రేమికులు, ప్రేక్షకుల హృదయాలు సరికొత్త సినీ లోకంలో విహరించడం ఖాయం.సెల్యులాయిడ్ సైతం ఆ సినీ మధురానుభూతిని భద్రంగా తన దగ్గర దాచుకోవడం కూడా ఖాయం.


ప్యారడైజ్ తో తన కట్ అవుట్ రేంజ్ పంచుకున్న  న్యాచురల్ స్టార్ నాని త్వరలోనే  హృదయాన్ని హత్తుకునే క్లాసిక్ ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ కోవలోనే  తమిళంలో '96', 'సత్యం సుందరం' వంటి అద్భుతమైన భావోద్వేగ చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న  సి. ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. 


ఇది కూడా చదవండి: సీఎం విజయ్‏ని కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక: ఆ హీరో ట్వీట్ వైరల్!

 


 ఈ ప్రాజెక్ట్స్ లో టాలెంటెడ్ నటి రుక్మిణి వసంత్ పేరు గట్టిగా వినిపిస్తోంది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు ఓవర్ నైట్ వైరల్ గా మారింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. సౌత్ లో మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటీ హోదాలో రుక్మిణి ఉంది. తన అందానికి తగ్గట్టే పెర్ఫార్మెన్స్ కూడా అదే స్థాయిలో ఉండటంతో సౌత్ లో భారీగా అభిమానులు ఉన్నారు. ప్రాజెక్ట్ కి కూడా మంచి ఉపయోగం. రుక్మిణి ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే.

 

[Nani And C Prem Kumar movie Heroine, Rukmini Vasanth In Nani, 96 director Prem Kumar, Nani new romantic movie, Tollywood movie updates, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]
 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com