
తలైవా రజనీకాంత్ రేపటి ప్రీమియర్స్ నుంచే జైలర్ 2 తో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. దీంతో సౌత్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొని ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ఇక రీసెంట్ గా జరిగిన ప్రమోషన్స్ లో రజినీ మాట్లాడుతు 'విద్యాబాలన్ కేవలం అందమైన నటి మాత్రమే కాదు. అద్భుతమైన ప్రతిభ కలిగిన అసాధారణ కళాకారిణి.
కేవలం ఈ చిత్రంలో ఒక క్యారక్టర్ లో నటించడమే కాకుండా, భవిష్యత్తులో ఆమెతో కలిసి ఒక పూర్తిస్థాయి పూర్తి పొడవు సినిమా చేయాలని మనసులో గట్టి కోరిక ఉందని రజనీకాంత్ తన మనసులోని మాటను బట్టబయలు చేశారు. దీంతో రజనీకాంత్ లాంటి లెజెండరీ స్టార్ హీరో తనతో కలిసి పూర్తి సినిమా చేయాలని కోరుకోవడం నిజంగా విద్యాబాలన్‌కు దక్కిన గొప్ప గౌరవంగా అభిమానులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: టాలీవుడ్ యంగ్ హీరోతో మమిత బైజు వివాహం:అతని నిర్ణయమే ఫైనల్ అని కూడా చెప్తున్న మమిత!

విద్యాబాలన్ విషయానికి వస్తే విభిన్నమైన కథాంశాలని ఎంచుకుంటూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులని చెయ్యడం ఆమె పెర్ఫార్మ్ స్టైల్. జైలర్ 2 లో కాంతా' అనే శక్తివంతమైన రోల్ లో కనిపించబోతున్నారు.అయితే ట్రైలర్ లో చూపించినట్టుగా తలైవా ఎదుట సిగరెట్ తాగుతూ ఆయన ముఖం వైపు పొగ వదిలే సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో విద్యాబాలన్ కొంత ఆందోళనకు గురయ్యారట. ఈ సన్నివేశం షూటింగ్ మొదటి రోజే జరిగిందని, విద్యాబాలన్ చేతులు వణకడం గమనించానని నెల్సన్ వెల్లడించారు. ఆ సీన్‌ను సరిగ్గా చిత్రీకరించడానికి సుమారు మూడు టేకులు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తెరపై ఎంతో ధైర్యంగా కనిపించే రోల్ పోషించేటప్పుడు ఆమె ఎదుర్కొన్న ఈ అనుభవం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
[Rajinikanth Desire To Act With Vidya Balan, Rajinikanth ABout Jailer 2, Rajinikanth About Vidya Balan, Jailer 2, Rajinikanth news, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]






