Home

»

Latest News

వరుణ్ తేజ్ చేతిలో వరుస సినిమాలు.. మరో ఇంట్రెస్టింగ్ కాంబో ఫిక్స్?

Oct 13, 2026 11:55AM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ‘ఆయ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అంజిబాబు కంచిపల్లితో వరుణ్ తేజ్ ఓ సినిమా చేయనున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంజి చెప్పిన కథాంశం వరుణ్‌కు నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన ‘ఆయ్’ సినిమాతో గ్రామీణ హాస్యం, భావోద్వేగాలను చక్కగా తెరపై ఆవిష్కరించిన అంజి, ఈసారి వరుణ్ తేజ్ కోసం మరో ఆసక్తికరమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డ్రామాతో పాటు వినోదానికి ప్రాధాన్యమిచ్చేలా ఈ కథ ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కథకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ పనులు జరగాల్సి ఉండగా, అవి పూర్తయిన తర్వాతే సినిమా నిర్మాణానికి సంబంధించిన తదుపరి అడుగులు పడే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, వరుణ్ తేజ్ ప్రస్తుతం యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారి’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ సమయంలో గాయపడటంతో వరుణ్ తేజ్ కొంతకాలం విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తయిన తర్వాత అంజి దర్శకత్వంలో రూపొందనున్న ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది.

 

 

[Varun Tej Next Movie, Varun Tej Anji Kanchipalli Movie, AAY Movie Director Anji, Varun Tej Upcoming Movies 2026, Mega Prince Varun Tej, Varun Tej Bhari Movie, Varun Tej Latest Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com