
గోల్డెన్ లెగ్ హోదాలో దూసుకుపోతూ ఉంది మలయాళ ముద్దు గుమ్మ' మమిత బైజు'. మమిత కొంతకాలం నుండి ఒక టాలీవుడ్ యంగ్ హీరో తో ప్రేమాయణం నడుపుతుందని , రీసెంట్ గా వీళ్లిద్దరు కలిసి ఒక ప్రైవేట్ పార్టీ కి వెళ్లి రావడాన్ని ఒక ప్రముఖ మీడియా రిపోర్టర్ చేసాడనే టాక్ నడుస్తుంది. వీళ్లిద్దరి పెళ్ళికి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారని , ఈ ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
Messi: మెస్సీ ఫుట్ బాల్ ప్రాక్టీస్ సెషన్స్‌లో: తెలుగు ఫోక్ సాంగ్..సోషల్ మీడియా క్రాష్!

అయితే ఆ వార్తలపై ఒకే ఒక్క పోస్టుతో మమిత క్లారిటీ ఇచ్చేసింది. తన పోస్ట్ లో ‘నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించేది నా సోదరుడు మిథున్ బైజు మాత్రమే. నేను, నా సోదరుడు స్నేహితులం కంటే ఎక్కువ. జీవితం లో నాకు సంబంధించిన ప్రతీ ముఖ్యమైన విషయంలో మిథున్ నిర్ణయమే ఫైనల్. నాకు వచ్చే లవ్ ప్రపోజల్స్ ని కూడా హ్యాండిల్ చేసేది అతనే’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే అభిమానులకు మమిత ఏమి చెప్పిందో అర్థం కాలేదు. యంగ్ హీరోని పెళ్లి చేసుకోబోతున్నాను అనే వార్తని ఆమె పూర్తి గా ఖండించలేదు , తన సోదరుడి నిర్ణయమే ఫైనల్ అంటుంది. అంటే దీని అర్థం ఏంటి?, ప్రస్తుతం తానూ ప్రేమలోనే ఉన్నాను , సోదరుడి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పిందా?, లేదంటే నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో నా సోదరుడే నిర్ణయిస్తాడని చెప్పిందా? అంటూ ఆ పోస్ట్ క్రింద నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
[Mamitha Baiju Marriage Rumors Clarification, Mamitha Baiju marriage, Mamitha Baiju wedding rumors, Mithun Baiju brother,Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]





