
సినిమాల్లో విలన్లను చితక్కొట్టడం రజనీకాంత్ స్టైల్. ఆయన స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. ప్రత్యర్థుల పని అయిపోయినట్టే. కానీ, ఇప్పుడు అదే రజనీకి ఓ సీనియర్ నటుడు కండిషన్ పెట్టారట. నన్ను కొట్టే సీన్లు ఉంటే మాత్రం సినిమా చేయనని చెప్పారట. ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి. ఈ ఆసక్తికరమైన విషయాన్ని స్వయంగా రజనీకాంత్ వెల్లడించడంతో ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.
రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రమంలో మిథున్ చక్రవర్తి కూడా సినిమాలో భాగం కావడం ఆసక్తిని పెంచింది. అయితే, ఈ సినిమా కోసం మిథున్‌ను సంప్రదించినప్పుడు జరిగిన సంభాషణ మాత్రం మరింత ఆసక్తికరంగా ఉంది.
ఇటీవల నిర్వహించిన ‘జైలర్ 2 సూపర్ షో’ కార్యక్రమంలో రజనీకాంత్ ఈ విషయాన్ని సరదాగా పంచుకున్నారు. సినిమా టీమ్ మిథున్ చక్రవర్తిని సంప్రదించినప్పుడు.. తన పాత్ర ఏమిటి? విలన్ పాత్రనా? ఒకవేళ విలన్ అయితే హీరో చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుందా? అని అడిగారట. తనను కొట్టే సన్నివేశాలు ఉంటే మాత్రం సినిమా చేయనని సరదాగా చెప్పారట.
ఆ తర్వాత వేవ్స్ సమ్మిట్ కార్యక్రమంలో రజనీకాంత్, మిథున్ చక్రవర్తి మధ్య ‘జైలర్ 2’ ప్రస్తావన వచ్చిందట. రజనీ అడిగితే సినిమాలో నటించేందుకు సిద్ధమేనని మిథున్ చెప్పారట. అయితే, తనకు కొన్ని షరతులు ఉన్నాయని స్పష్టం చేశారట.
తనను కొట్టే సన్నివేశాలు ఉండకూడదని, కాల్చడం లాంటి సన్నివేశాలు కూడా చేయించకూడదని చెప్పారట. దీంతో ఈ విషయాన్ని దర్శకుడు నెల్సన్‌తో మాట్లాడి చెబుతానని రజనీకాంత్ సమాధానమిచ్చినట్లు వెల్లడించారు.

సాధారణంగా సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు, ఫైట్లు సహజమే. కానీ, తన పాత్ర విషయంలో మిథున్ పెట్టిన ఈ కండిషన్ మాత్రం అందరినీ నవ్విస్తోంది. మరి నెల్సన్ ఈ షరతులను దృష్టిలో పెట్టుకుని మిథున్ పాత్రను ఎలా డిజైన్ చేశారో చూడాలి.
2023లో విడుదలైన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడంతో సీక్వెల్‌పై సహజంగానే అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ‘జైలర్ 2’తో ఆ మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
ఇది కూడా చదవండి: బ్రేకప్‌కు బ్రేక్.. మళ్లీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్.!
[Jailer 2 Mithun Chakraborty Condition, Jailer 2 Movie, Rajinikanth, Mithun Chakraborty, Nelson Dilipkumar, Jailer 2 Updates, Telugu News]





