
యష్ వన్ మాన్ షో 'టాక్సిక్' అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతూ ఉంది. కొంతసేపటి క్రితం తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో అభిమానులు, ప్రేక్షకులు టికెట్స్ బుక్ చేసుకొనే పనిలో ఉన్నారు. హిందీ బెల్ట్ లో అయితే తొలిరోజే దాదాపు 50 కోట్ల ఓపెనింగ్స్ అందుకునే దిశగా సరికొత్త రికార్డు నమోదు చేస్తోంది. సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ విజువల్ వండర్, 1940 నుండి 1970ల కాలంనాటి పోర్చుగీస్ పాలనలో ఉన్న గోవా నేపథ్యంలోని క్రైమ్, డ్రగ్ కార్టెల్ అండ్ గ్యాంగ్‌స్టర్ సామ్రాజ్యం చుట్టూ తిరుగుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ 'A' సర్టిఫికేట్ జారీ చేయగా, నిడివి 3 గంటల 14 నిమిషాలు.
సినిమా ప్రివ్యూలు మరియు ఫస్ట్ రివ్యూస్ ఆధారంగా 'టాక్సిక్' కేవలం ఒక మాస్ సినిమా మాత్రమే కాదు, మైండ్ బ్లాక్ చేసే అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ధమాకా అని తెలుస్తోంది. హాలీవుడ్ ప్రఖ్యాత స్టంట్ మాస్టర్, 'జాన్ విక్' ఫేమ్ జేజే పెర్రీ పర్యవేక్షణలో రూపొందించిన యాక్షన్ సీక్వెన్సులు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని రక్తం చిందే రా అండ్ రస్టిక్ వైలెన్స్‌ను ఆవిష్కరించాయి. మొదటి భాగంలో యష్ ప్రవేశించే 'రాయా' పాత్ర ఎంట్రీ సీన్ ఐకానిక్‌గా నిలిచిపోతుందని, ఆయన మాస్ ఆరా మరియు క్యారెక్టర్ డెప్త్ థియేటర్లను షేక్ చేస్తున్నాయని సమీక్షకులు చెబుతున్నారు. విదేశాల్లో లభించిన యూకే బుకింగ్స్ రేటింగ్స్‌లో వైలెన్స్, యాక్షన్ విభాగానికి 5 కి 5 రేటింగ్ లభించడం దీని రస్టిక్ స్పష్టం చేస్తోంది.
Also Read: రాజకీయాల్లోకి యష్!.. వైరల్ గా మారిన న్యూస్
నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా మరియు రుక్మిణి వసంత్ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రలలో మెరిశారు. కేవలం పురుషాధిక్య యాక్షన్ సినిమాలా కాకుండా, ప్రతీ స్త్రీ రోల్ కి కథలో బలమైన ఉనికి ప్రాధాన్యతని దర్శకురాలు గీతూ మోహన్ దాస్ అందించిన తీరు మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం (BGM) మరియు రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌నూ ఒక కాన్వాస్‌లా మార్చివేసాయి. . ఒకవైపు వైలెన్స్ అండ్ యాక్షన్, మరోవైపు ఎమోషనల్ అండ్ డార్క్ సైకలాజికల్ షేడ్స్‌తో కూడిన ఒక గ్రోన్-అప్ ఫెయిరీ టేల్‌లా 'టాక్సిక్' ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని ఇస్తోంది. బాక్సాఫీస్ వద్ద యష్ వేట మొదలైందని, ఈ చిత్రం అన్ని భాషల్లోనూ వందల కోట్ల వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో KVN ప్రొడక్షన్స్ మరియు మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
yash, Toxic, Geethu Mohandas





