
స్టార్ హీరోయిన్ కృతి సనన్ చేసిన రక్షా బంధన్ జ్యువెలరీ యాడ్ తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. 'గివా' అనే ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ రూపొందించిన ఈ డిజిటల్ ప్రకటనలో కృతి సనన్ మోడ్రన్ ఇండో వెస్ట్రన్ అవుట్‌ఫిట్ ధరించి కనిపించింది .ముఖ్యంగా బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, కేప్, డ్రాప్డ్ స్కర్ట్ తో గ్లామరస్‌గా కనిపిస్తూ తన సోదరుడికి రాఖీ కడుతున్న సన్నివేశం నెటిజన్ల మధ్య పెద్ద చర్చకి దారితీస్తూ ఉంది.
ఈ వివాదంపై కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా స్పందిస్తు ' మహిళలకి దుస్తుల ఎంపికలో ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మన వార్డ్‌రోబ్‌లో జీన్స్, చీరలు, సల్వార్ కమీజ్ నుండి కాక్‌టైల్ డ్రెస్‌లు, లెహంగా చోలీల వరకు ఎన్నో రకాల దుస్తులు ఉన్నాయి. అలాంటప్పుడు పవిత్రమైన రక్షా బంధన్ పండుగ రోజున సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు బికినీ లేదా లోదుస్తుల తరహా దుస్తులు వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?. పవిత్రమైన సంప్రదాయ వేడుకల ప్రకటనలలో ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి వివాదాస్పదమైన దృశ్యాలని చిత్రీకరించినట్టుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది!
కంగనాని గతంలో ఫెయిర్‌నెస్ క్రీమ్ కంపెనీ వాళ్ళు 2 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ తో తమ ప్రకటనలో కనిపించమని అడిగారు. కానీ మన దేశం రకరకాల వర్ణాలు, సంస్కృతులతో కూడుకున్నదని, కేవలం తెల్లగా ఉండటమే అందానికి కొలమానం అనే భావనని ఎప్పటికీ సమర్థించనని కంగనా తేల్చిచెప్పారు.
Kangana Ranaut, Kriti Sanon, Rakhi Ad






