
ధురంధర్ సిరీస్ సాధించిన విజయం, సృష్టించిన కలెక్షన్ తుఫాన్ తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ కి పట్టిన దిష్టి మొత్తాన్ని తీసేసింది. ఎందుకంటే దిష్టి ఏదో పెట్టినట్టుగా బాలీవుడ్ కి సరైన హిట్ వచ్చి చాలా దినాలు అవుతుంది. దీంతో బయటి ప్రేక్షకులతో పాటు సొంత ప్రేక్షకుల్లోనే నవ్వులు పాలయ్యే పరిస్థితి. వాటన్నిటికీ చెక్ పెట్టేసి ధురంధర్ సిరీస్ బాలీవుడ్ ని కాలర్ ఎగరేసేలా చేసింది. వరల్డ్ వైడ్ ఉన్న ధురంధర్ అభిమానులైతే మూడో పార్టు కూడా కావాలని ధర్నా చేసే పరిస్థితి. దీన్ని బట్టి ధురంధర్ చరిష్మా అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సినిమాని మరిపించేలా శింబు మూవీ ముస్తాబవుతుందనే మాటలు ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో శింబు (శిలంబరసన్ TR), ప్రతిభావంతుడైన దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'అరసన్'. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై తమిళ చిత్రసీమలోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల చెన్నైలోని సత్యభామ కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న శింబు మాట్లాడుతు ;బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ నటించిన 'దురంధర్' చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ఘనవిజయాన్ని సాధించి హిందీ పరిశ్రమ గర్వపడేలా చేసిందో, అదే తరహా సంచలనాత్మక ప్రభావాన్ని తమ 'అరసన్' చిత్రం తమిళ సినీ పరిశ్రమకు తీసుకొస్తుంది. కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గర్వపడతారు. 'అరసన్' ఏమాత్రం చిన్న సినిమా కాదు. కథా పరిధి చాలా విస్తృతమైనది . హీరో తన చిన్నతనం నుంచి వృద్ధాప్యం వరకు జరిగే సుదీర్ఘ జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ క్యారక్టర్ కోసం 6 భిన్నమైన గెటప్పులలో కనిపించబోతున్నాను. ఇప్పటివరకు 3 గెటప్పులకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన 3 గెటప్పుల షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది.క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా ముగించకుండా సమయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మన్మధ మూవీతో తెలుగులో కూడా శింబుకి రెండు దశాబ్దాల నుంచే అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.

Also Read: వీడియో లీక్: జయం రవి, కేనిషా కలిసి ఒకరికొకరు... క్లియర్ గా అర్ధమవుతుంది!
ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. ఇది వెట్రిమారన్ తీసిన సూపర్‌హిట్ చిత్రం 'వడ చెన్నై' సినిమా విశ్వంలోకి (Vada Chennai Universe) వస్తుంది. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రలో నటిస్తుండగా, ఆండ్రియా జెర్మియా, సముద్రఖని, కిషోర్, అమీర్ వంటి ప్రముఖ నటులు తమ పాత్రలను పునరావృతం చేస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, వి క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కలైప్పులి ఎస్ ధాను నిర్మిస్తున్నారు. అద్భుతమైన టెక్నికల్ టీమ్ మరియు బలమైన కథాంశంతో వస్తున్న 'అరసన్' ఖచ్చితంగా భారతీయ సినిమాలో సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
[Simbu, Arasan, Dhurandhar Impact, vetri Maaran, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]






