Home

»

Latest News

సూర్య 47 మూవీ టైటిల్ ఇదేనా: మరి వాళ్ళు గొడవ చేస్తారేమో కదా!

Sep 9, 2026 6:19PM

 

 

గ్రహణం విడిచిన చంద్రుడిలా  సూర్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. మరి వరుసగా రెండు చిత్రాలు మూడు వందల కోట్ల మైలు రాయిని అందుకోవడం మాటలా  చెప్పండి. కరుప్పు లాంగ్ రన్ లో 300 కోట్ల క్లబ్ లో చేరగా,  విశ్వనాధ్ అండ్ సన్స్ 250 కోట్ల నుంచి 300 కోట్లకి చేరడానికి ఉవ్విళూరుతుంది. ఇప్పుడు తన 47వ సినిమాకి సంబంధించిన అత్యంత క్రేజీ అప్‌డేట్ ఆ రెండు చిత్రాల ఖ్యాతిని వెనక్కి నెట్టే పనిలో బిజీగా ఉంది.

సదరు చిత్రానికి  'సీన్' (Scene) అనే విభిన్నమైన టైటిల్‌  పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే మరో మాస్ సినిమాతో సూర్య సీన్ సితారా చేయడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. పైగా ఈ చిత్రానికి రోమాంచమ్', 'ఆవేశం' వంటి వరుస ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దూసుకుపోతున్న మలయాళ యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ జీతూ మాధవన్ దర్శకుడు కావడంతో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. ఇక అదే టైంలో  సీన్'  టైటిల్ మాదే అంటూ ఎవరైనా వస్తారేమో అనే  న్యూస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే ఈ మధ్యన ఇలాంటి కేసులే ఎక్కువ అయ్యాయి కాబట్టి.

 


Also Read: ఆ ఐదు బడా హీరోల సినిమాలకి చుక్కలు: ఇరుముడి నైజాం ఏరియా అరుదైన రికార్డు! 

సూర్య సరసన హోమ్లీ అండ్ గ్లామరస్ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాకుండా 'ప్రేమలు' సినిమాతో పాన్-ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ క్రేజీ యాక్టర్ నస్లెన్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం. మలయాళంలో సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ ఈ సినిమాకు మైండ్ బ్లావింగ్ ట్యూన్స్ అందిస్తున్నారు.

 

   

 

[Suriya 47,Scene , Jithu Madhavan, Naslen, Nazriya Nazim, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com