Home

»

Latest News

ఆ ఐదు బడా హీరోల సినిమాలకి చుక్కలు: ఇరుముడి నైజాం ఏరియా అరుదైన రికార్డు! 

Sep 9, 2026 5:49PM

జనరల్ గా ఎంత పెద్ద హిట్ సినిమా అయినా రెండో వారం దాటి మూడో వారంలోకి అడుగుపెడితే కలెక్షన్ల వేగం నెమ్మదించడం కామన్.  కానీ 'ఇరుముడి' విషయంలో మాత్రం ఆ బాక్సాఫీస్ సూత్రాలన్నీ బుంగమూతి పెట్టుకోవడం స్టార్ట్ చేసాయి. ఎందుకంటే మూడో ఆదివారం నాడు కూడా  ఏకంగా 2.15 లక్షల టికెట్లు అమ్ముడవడమే.


 ముఖ్యంగా నైజాం ఏరియాలో 'ఇరుముడి' సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీ ఒక విధ్వంసమనే చెప్పాలి. ఇప్పటికే నైజాం ప్రాంతంలో  83 .75 కోట్ల గ్రాస్ లోకి చేరింది. అంటే  58 కోట్ల షేర్ రాబట్టి , నాన్, మల్టీస్టారర్ మరియు నాన్-సీక్వెల్ విభాగంలో టాలీవుడ్ టాప్ రికార్డులని  ఒక్కొక్కటిగా అధిగమిస్తోంది. గతంలో 55 కోట్ల షేర్ నమోదు చేసిన 'పెద్ది' మార్కును దాటేసి నైజాంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల టాప్ 5 జాబితాలో సగర్వంగా నిలిచింది. ప్రస్తుతం 'కల్కి' 93 కోట్లు, 'సలార్' .72 కోట్లు, 'దేవర' 63 కోట్లు వంటి భారీ చిత్రాల సరసన నిలిచిన 'ఇరుముడి', అతి త్వరలోనే నైజాంలో ఏకంగా 100 కోట్ల గ్రాస్ మైలురాయిని అందుకోవడానికి అడుగులు వేస్తోంది. రానున్న వినాయక చవితి పండుగ సెలవులు కూడా తోడుకానుండటం అదనపు బలం.

 

 

 

Also Read: ఆ భాషపై శివరాజ్ కుమార్ వ్యాఖ్యలు వైరల్..పెద్దిలో గౌరు నాయుడుగా అలరించాడు కదా!


దర్శకుడు శివ నిర్వాణ తండ్రీకూతుళ్ల అనుబంధం, భక్తి, భావోద్వేగాల కలయికతో తీర్చిదిద్దిన ఈ కథ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. పెట్టుబడికి ఇప్పటికే 100 కోట్లకు పైగా నికర లాభాలను అందించి, ఏకంగా 4 నుండి 5 రెట్ల ప్రతిఫలాన్ని నిర్మాతలకు తెచ్చిపెట్టింది. రవితేజ శక్తివంతమైన నటన, ప్రియా భవానీ శంకర్ సహజ అభినయం, చిన్నారి బేబీ నక్షత్ర అమాయకత్వం, దీనికితోడు జీవీ ప్రకాష్ అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. కొత్త చిత్రాలు పోటీగా వస్తున్నప్పటికీ, మూడో వారంలోనూ అదే స్థాయి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండటంతో ఈ చిత్రాన్ని నిర్మాతలు 'జనరేషనల్ బ్లాక్‌బస్టర్'గా కొనియాడుతున్నారు. ఓవర్ ఆల్ గా ఇరుముడి కలెక్షన్స్ చూసుకుంటే ప్రెజెంట్ 250 కోట్ల మార్కుకి చేరువలో ఉంది.

 

 

[Irumudi, Nizam Box Office, Peddi, Kalki, salaar, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com