Home

»

Latest News

మారెమ్మ మూవీ ఫస్ట్ రివ్యూ: మాస్ మహారాజా వారసుడు మెప్పించాడా.?

Sep 9, 2026 7:09PM

మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి మరో యంగ్ హీరో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయం అవుతున్న లేటెస్ట్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మారెమ్మ'. సెప్టెంబర్ 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.

పెంపుడు జంతువులకు, మనుషులకు మధ్య ఉండే ఒక విడదీయరాని ఆత్మీయ అనుబంధాన్ని.. గ్రామీణ నేపథ్యం, డివోషనల్ టచ్‌తో ఒకే ఫ్రేమ్‌లో చూపిస్తే ఆ ఎమోషన్ ఏ రేంజ్‌లో ఉంటుంది? మంచాల నాగరాజు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'మారెమ్మ' అలాంటి ఒక సరికొత్త ప్రయత్నమే. వరంగల్ జిల్లాలోని మహిషాపురం అనే గ్రామంలో గత్తర వ్యాధి వల్ల వరుస మరణాలు సంభవిస్తాయి. ఊరిని కాపాడుకోవడానికి గ్రామ దేవత మారెమ్మ పేరు మీద ఒక దున్నపోతును పెంచుతారు. ఆ దున్నపోతును ప్రాణంగా చూసుకునే పశువుల కాపరి మారి పాత్రలో మాధవ్ జీవించేశారు.

అయితే, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికెట్ జారీ చేసింది. దీనికి కారణం సినిమాలో ఉన్న రా అండ్ రస్టిక్ యాక్షన్ సీన్స్, వయలెన్స్, హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్. మొదట్లో సెన్సార్ బోర్డు సభ్యులు కొన్ని సీన్స్, డైలాగ్స్ కట్ చేయాలని సూచించినప్పటికీ.. ఆ సీన్లు తీసేస్తే కథలో ఉన్న అసలైన ఎమోషనల్ స్ట్రెంత్ దెబ్బతింటుందని చిత్ర యూనిట్ భావించింది. కథలోని నిజాయితీకి, మేకర్స్ విజన్‌కు సంతృప్తి చెందిన సెన్సార్ బోర్డు ఎటువంటి మేజర్ కట్స్ లేకుండానే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మాధవ్ భూపతిరాజుకు ఇది మొదటి సినిమా అయినప్పటికీ, ఎక్కడా కొత్త నటుడిలా కాకుండా చాన్నాళ్ల అనుభవం ఉన్న నటుడిలా జీవించేశారని సెన్సార్ నుంచి టాక్ వినిపిస్తోంది. హీరోయిన్‌గా తమిళ నటి దీపా బాలు నటిస్తుండగా, వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, దయానంద్ రెడ్డి వంటి నటులు కీలక పాత్రల్లో మెరిసారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం, ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ ఈ గ్రామీణ కథకు ప్రాణం పోశాయని తెలుస్తోంది. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న థియేటర్లను కుదిపేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఎలాంటి కమర్షియల్ హంగులకు పోకుండా నిజమైన పల్లెటూరి వాతావరణం, ఎమోషన్స్, ఊరమాస్ యాక్షన్‌ను తెరపై ఆవిష్కరించిన చిత్రం 'మారెమ్మ'. 

 

 

 

[Maremma First Review, Maremma Review, RaviTeja, Madhav Bhupathiraju, Telugu Movie Review, Telugu Cinema Review, Telugu Movies 2026, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com