రేపు సూపర్ స్టార్ అంత్యక్రియలు!
on Nov 15, 2022
సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఆనారోగ్యంతో ఆస్పత్రి పాలైన ఆయన చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణ పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి తరలించారు. ఎందరో ప్రముఖులు ఆయనకు నివాళి అర్పించడానికి తరలి వెళ్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శనార్ధం కృష్ణ పార్ధివదేహాన్ని ఉంచనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం. కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read