
బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నటిస్తున్న సినిమా "ఇడుపు కాయితం". ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా "ఇడుపు కాయితం" సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా నుంచి 'శ్రీలత..' సాంగ్ రిలీజ్ చేశారు.
'శ్రీలత..' సాంగ్ లో హీరో ప్రియదర్శి, హీరోయిన్ నాగదుర్గ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఈ పాటను సురేష్ బొబ్బిలి మంచి మెలొడీ ట్యూన్ తో కంపోజ్ చేశారు. పాట మూడ్ కు తగినట్లు ప్లెజెంట్ లిరిక్స్ అందించారు లిరిక్ రైటర్ అలరాజు. శంకర్ బాబు, మోహన భోగరాజు పాటను రిపీటెడ్ గా వినాలనిపించేలా పాడారు. ఈ పాటను పిక్చరైజ్ చేసిన అందమైన లొకేషన్స్, పిల్లలతో చేయించిన డ్యాన్స్ సీక్వెన్సులు హైలైట్ గా నిలుస్తున్నాయి. 'శ్రీలత..' సాంగ్ అతి తక్కువ టైమ్ లోనే డిజిటల్ వ్యూస్ లో దూసుకెళ్తుందనే అంచనాలు మ్యూజిక్ లవర్స్ లో ఏర్పడుతున్నాయి.
"ఇడుపు కాయితం" సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
[Idupu Kayitham Movie, Srilatha Song, Telugu Songs, Priyadarshi, Naga Durga, Suresh Bobbili, Sukumar, Telugu Film News]






