Home

»

Latest News

అల్లు అర్జున్ ఫ్యాన్స్ గొప్పతనం: 3 లక్షల మంది బాలికలకు HPV వ్యాక్సిన్‌పై అవగాహన.!

Sep 11, 2026 6:13PM

సొసైటీ బాగు కోసం ముందడుగు వేస్తూ తమ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రత్యేకతను చాటుకుంటోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA). కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ్ నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెచ్ పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై  దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 820 స్కూల్ అవేర్ నెస్ ఈవెంట్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మద్ధతుగా నిలిచింది.  ఈ కార్యక్రమాల ద్వారా 3 లక్షలమంది యువతులకు చేరువైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ వంటి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరుగా స్కూల్స్, కమ్యూనిటీల్లో ఈ అవగాహన కార్యక్రమాలను ఎఎఎఫ్ఎ నిర్వహించింది.

సామాజిక బాధ్యత గల అల్లు అర్జున్ అభిమానులంతా సమష్టి కృషితో ఈ ఘనతను సాధించారు. హెచ్ పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించడంలో బాలికలకు, యువతులకు ఆరోగ్యకరమైన భవితను అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఒక గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానుల ఒక్కటవడం విశేషం.

 

 

 

[Allu Arjun Fans Association, HPV Vaccine Awareness Drive, Allu Arjun Fans, HPV Vaccine, India, Allu Arjun, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com