Home

»

Latest News

వీడియో లీక్: జయం రవి, కేనిషా కలిసి ఒకరికొకరు... క్లియర్ గా అర్ధమవుతుంది!

Sep 8, 2026 11:32AM

 

 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన 'ధ్రువ' మూవీ, తమిళ్ లో జయం రవి చేసిన మూవీ అనే విషయం తెలిసిందే. దీన్ని బట్టి జయం రవి సినిమాల పట్ల ఉండే క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.  గత కొన్ని నెలలుగా జయం రవి  వ్యక్తిగత జీవితం వరుస వివాదాలకి  వేదికగా మారుతోంది. భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు రవి అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి, సోషల్ మీడియా వేదికగా నిత్యం ఏదో ఒక కొత్త రగడ వెలుగులోకి వస్తూనే ఉంది. రవి, ఆయన భార్య ఆర్తి మధ్య విడాకుల కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో విచారణలో ఉండగానే, తాజాగా నెట్టింటిలో  ప్రత్యక్షమైన ఒక వీడియో ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రసీమలో తీవ్ర కలకలం రేపుతోంది.  


లీక్ అయిన  వీడియో క్లిప్‌లో జయం రవి, గాయని కేనిషా ఫ్రాన్సిస్‌తో కలిసి చాలా సన్నిహితంగా కనిపిస్తున్నారు. అంతేకాదు, వారిద్దరూ ఒకే సిగరెట్‌ను పరస్పరం షేర్ చేసుకుంటూ సంభాషిస్తున్నట్లు ఆ దృశ్యాల్లో వ్యక్తమవుతోంది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారి, పలు చర్చలకి దారి తీస్తుంది. కేనిషా గురించి గతంలో జయం రవి మాట్లాడుతు 'కేనీషా నాకు మంచి స్నేహితురాలు మా  మధ్య ఎలాంటి వివాహేతర సంబంధం లేదు. అంతేకాకుండా, ఆర్తి చేసిన అనవసర ఆరోపణల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన కేనిషా, తన నుంచి 100% దూరంగా వెళ్ళిపోయిందని చెప్పాడు. అయితే, తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న క్లిప్పింగ్స్ వెలుగులోకి రావడంతో, గతంలో ఆయన చెప్పిన మాటలన్నీ అబద్ధమేనా అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

 


  
also read: మూడు కోట్లు కట్టాల్సిందేనా: ఆ రోజు ఫ్లైట్ లో ఏం జరిగింది? లీక్ అయిన వీడియోలో ఏముంది!

అయితే, ఈ వైరల్ క్లిప్ వెనుక వేరే కోణాలు కూడా ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. నెటిజన్లలో ఒక వర్గం ఇది ఆధునిక ఏఐ (Artificial Intelligence) సాంకేతికత లేదా డీప్‌ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన ఫేక్ వీడియో అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో ఇది పాత వీడియోనా లేక ఈ మధ్య కాలంలో చిత్రీకరించబడిందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏఐ దెబ్బకి 'ఎవరు ఒరిజినల్,ఎవరు డూప్లికేట్టొ తెలియక జుట్టు పీక్కొనే రోజులు వచ్చేసాయి. బహుశా వందల ఏళ్ళ క్రితం పెద్దలు ఇది ఊహించే 'పెరుగుట విరుగుట కొరకే' అనే సామెతని లూప్ లైన్ లోకి తెచ్చి ఉంటారు. 

 

 

[Jayam Ravi, Kenishaa Francis, Video Viral, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com