Home

»

Latest News

‘నమ్మొద్దురా.. అడుక్కు తిను’.. థమన్ రిప్లైతో సోషల్ మీడియాలో నవ్వులే నవ్వులు!

Oct 14, 2026 3:21PM

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సంగీతంతో ప్రేక్షకులను అలరించే ఆయన.. సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో సందడి చేస్తుంటారు. ముఖ్యంగా తనపై వచ్చే ట్రోల్స్‌కు అప్పుడప్పుడు ఫన్నీగా కౌంటర్లు ఇస్తుంటారు. తాజాగా ‘అల వైకుంఠపురములో’ సినిమా మ్యూజిక్‌పై ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు థమన్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో 2020లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాకు థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు అప్పట్లోనే కాకుండా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా ‘బుట్ట బొమ్మ’, ‘రాములో రాములా’ పాటలు భారీ ఆదరణ పొందాయి. అయితే తాజాగా ఓ నెటిజన్ ఈ సినిమా గ్లింప్స్‌ను షేర్ చేస్తూ.. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడంటే నమ్మలేకపోతున్నానంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు.

ఈ కామెంట్‌పై స్పందించిన థమన్.. మహేశ్ బాబు హీరోగా నటించిన ‘దూకుడు’ సినిమాలో బ్రహ్మానందం చెప్పే ‘నమ్మొద్దురా.. అడుక్కుతిను’ అనే డైలాగ్‌తో కూడిన మీమ్ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో థమన్ ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు థమన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం AK 47’తో పాటు చిరంజీవి ‘కాకా’, బాలకృష్ణ ‘దాదా’ వంటి సినిమాలకు సంగీతం అందిస్తున్నారు.

 

 

[S Thaman, Thaman Viral Reply, Ala Vaikunthapurramuloo Music, Allu Arjun, Thaman Troll Response, Brahmanandam Dookudu Meme, Thaman Latest News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com