Home

»

Latest News

స్టార్ క్యాస్ట్ లేదు: గ్లామర్ పాటలు లేవు..ప్రస్తుతం 70 కోట్ల కలెక్షన్స్.. ఓటిటిలోకి వచ్చేస్తుంది!

Oct 14, 2026 3:31PM

 

కొన్ని చిత్రాలు అంతే.. సెల్యులాయిడ్ పై అడుగుపెట్టే వరకు పెద్ద సినిమా కాదు అనే సినీ అపవాదుని మోస్తూ ఉంటాయి. కానీ సెల్యులాయిడ్ పై అడుగుపెట్టాక ప్రేక్షకులు, బాక్స్ ఆఫీస్ ఆదరించేవే పెద్ద సినిమాలు అనేలా చేస్తాయి. అలా చేసిన చిత్రమే 'ప్రేమద ఊరలి'. సెప్టెంబర్ 25 న రిలీజ్ అవ్వగా అదే రోజు తెలుగులో కూడా 'ప్రేమనే ఊరి' గా వచ్చింది.


కన్నడ మూవీ  'ప్రేమద ఊరలి' కన్నడ నాట  మౌత్ టాక్‌తో 70 కోట్ల క్లబ్ లో చేరింది. ఎలాంటి స్టార్ క్యాస్ట్, మేకర్స్ లేకుండా మూడువారాల్లోపే ఆ స్థాయి కలెక్షన్స్ ని రాబట్టిందంటే ఏ స్థాయిలో ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంటుందో అర్ధం చేసుకోవచ్చు.అయితే  బాక్సాఫీస్ వద్ద భారీ విజయవంతం కావడంతో, ఓటీటీ ప్రియులు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల రూమర్స్‌కి  మేకర్స్ చెక్ పెట్టారు. ప్రస్తుతానికి తాము ఏ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తోనూ లేదా శాటిలైట్ ఛానెల్‌తోనూ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని లీడ్ యాక్టర్ శ్రీరామ్ అధికారికంగా స్పష్టం చేశారు.


ఇది కూడా చదవండి: సల్మాన్ ఖాన్ ముందు భోరున ఏడ్చేసిన డైరెక్టర్.. సూపర్ అంటున్న ఫ్యాన్స్ 

 

 

శ్రీరామ్ తో పాటు  తపస్విని పూనాచా, రమికా శివు వంటి నూతన నటీనటులతో పాటు రంగాయణ రఘు, గోవిందే గౌడ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మనోజ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ  గ్రామీణ ప్రేమకథా చిత్రానికి, ‘వనిల్లా ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై నిర్మాతలు అత్యంత రిచ్‌గా, అందమైన విజువల్స్‌తో తెరకెక్కించారు. స్వచ్ఛమైన ప్రేమకథ, తండ్రీకొడుకుల మధ్య ఉండే భావోద్వేగాలే  ప్రేమద ఊరలి కంటెంట్.


 

[Premada Oorali Movie Ott Update, Premada Oorali Collections, Premada Oorali movie, Premada Oorali box office, Kannada blockbuster 2026,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com