
ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌పై రోజుకో ఆసక్తికర వార్త బయటకు వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో దీపికా పదుకొణె స్థానంలో ఎవరు నటిస్తారనే విషయంలో కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఆమె నవంబర్‌లో ‘కల్కి 2’ షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగంలో ప్రభాస్ భైరవగా, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్‌గా కీలక పాత్రల్లో కనిపించారు. దీపికా పదుకొణె సుమతి పాత్రలో నటించారు. అయితే ఆమె ఈ సీక్వెల్లో కొనసాగడం లేదని నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది.
దీపికా పదుకొణె తప్పుకున్న తర్వాత ఆమె స్థానంలో సాయి పల్లవిని తీసుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పుడు నవంబర్‌లో ఆమె షూటింగ్లో పాల్గొనవచ్చనే వార్తలు ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తున్నాయి. అయితే సాయి పల్లవి నటించనున్న విషయాన్ని చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

‘కల్కి 2’ షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తయినప్పటికీ, ప్రభాస్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో చిత్రీకరణకు విరామం వచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ షూటింగ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు నాగ్ అశ్విన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభాస్ డిసెంబర్ రెండో వారంలో షూటింగ్లో పాల్గొనవచ్చనే ప్రచారం కూడా ఉంది.
సాయి పల్లవి ప్రస్తుతం నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’లో సీత పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ‘కల్కి 2’లో ఆమె భాగమైతే, మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆమె ఖాతాలో చేరినట్లే.
ఇది కూడా చదవండి: ‘రామాయణ’ ట్రైలర్ 2 వచ్చేస్తోంది.. యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.!
[Sai Pallavi In Kalki 2, Kalki 2898 AD Sequel, Kalki 2 Shooting Update, Kalki 2 Movie, Sai Pallavi, Prabhas, Deepika Padukone, Nag Ashwin, Telugu Film News]




