Home

»

Latest News

RC17 పూజకు ముహూర్తం ఫిక్స్: రామ్ చరణ్, సుకుమార్ సెకండ్ మూవీ అందుకే లేట్.!

Oct 21, 2026 4:23PM

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ మరోసారి చేతులు కలుపుతున్నారు. ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కనున్న RC17 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది.

RC17 సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. మైత్రి నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ తాజాగా ఈ మూవీ లాంచ్ అప్డేట్ ఇచ్చారు. "మొదట దసరాకు పూజ కార్యక్రమం అనుకున్నాము. కానీ ఈసారి మూడం ఉందన్నారు. అందుకే అక్టోబర్ 26 లేదా 27 తేదీల్లో మంచి ముహూర్తం చూసి లాంచ్ చేస్తాం." అని చెప్పారు.

ప్రస్తుతం RC17 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, చరణ్ నటనకు ప్రశంసలు తెచ్చిపెట్టింది. చిట్టిబాబు పాత్రలో ఆయన చూపించిన నటన ఇప్పటికీ అభిమానులకు గుర్తుండిపోయే ప్రత్యేకమైన పాత్రల్లో ఒకటి.

ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో RC17పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈసారి సుకుమార్ ఎలాంటి కథను సిద్ధం చేశారు? రామ్ చరణ్‌ను ఏ తరహా పాత్రలో చూపించబోతున్నారు? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

RC17 కోసం రామ్ చరణ్ తన లుక్‌ను మార్చుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. పాత్రకు తగ్గట్టుగా శారీరకంగా కూడా ప్రత్యేకమైన మార్పులు చేసుకుంటున్నట్లు ప్రచారం ఉంది. 

ఇది కూడా చదవండి: షాకిచ్చిన వారణాసి బ్యూటీ.. ఆ భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న ప్రియాంక చోప్రా.!

 

 

[RC17 Pooja Ceremony, RC17 Pooja Date, RC17 Launch Date, RC17 Movie, Ram Charan, Sukumar, Mythri Movie Makers, Donga Naa Koduku, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com