
నవంబర్ 5 న సెల్యులాయిడ్ పై మరోసారి 'రామాయణ' ద్వారా రాముడు, సీతాదేవి, ఆంజనేయుడు, రావణుడు ప్రత్యక్షం కాబోతుండటంతో అభిమానుల్లో, సినీ ప్రేమికుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది. ఆ సందడి వాతావరణాన్ని రెట్టింపు చేస్తు మేకర్స్ నిన్న విజయదశమి పురస్కరించుకొని అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసారు.
అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన తర్వాత... ఒక రోజులో దేశవ్యాప్తంగా సుమారు 5.35 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు సుమారు 91 వేల టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 95 శాతం వాటాతో 5.16 కోట్ల వసూళ్లని సాధించింది. ఇక కన్నడ వెర్షన్ కూడా 27.95 లక్షల వసూళ్లతో బలమైన ప్రభావాన్ని చూపుతోంది. ఫార్మాట్ల వారీగా చూస్తే హిందీ 3D వెర్షన్ 65 శాతం వాటాతో 3.53 కోట్లు, ఐమ్యాక్స్ (IMAX), 4DX, డాల్బీ వంటి ప్రీమియం ఫార్మాట్లు కేవలం 6 శాతం షోలతోనే 30 శాతం గ్రాస్‌ను సాధించడం విశేషం.
ఇది కూడా చదవండి: ఆ విషయంలో: టాలీవుడ్ వెనకబడిందా!

ఓవర్సీస్ ప్రీ సేల్స్ విషయానికి వస్తే... 1.3 మిలియన్ డాలర్ల మార్క్ దాటింది. మరి కలెక్షన్స్ ల ప్రభంజనం రాబోయే రోజుల్లో ఏ రికార్డు బాక్స్ ఆఫీస్ తీరం దాటుతుందో చూడాలి.
[Ramayana Advance Booking Collections, ramayana advance Booking, Ramayana advance booking, Ranbir Kapoor Ramayana, Ramayana box office collection, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






