
టాలీవుడ్, ఉరఫ్ తెలుగు చిత్ర పరిశ్రమ.. ఎన్నో అద్భుతమైన చిత్రాలని అందిస్తూ తన ప్రతాపాన్ని చాటుతూ ఉంది. పాన్ ఇండియా మెరుపుల్ని కూడా అద్దుకొని తన సామ్రాజ్యాన్ని ఒక రేంజ్ లో విస్తరించుకున్న తెలుగు పుత్తడి బొమ్మ ఒక విషయంలో మాత్రం వెనుకంజ వేసిందనే చర్చ ఈ మధ్య సినీ సర్కిల్స్ లో ఫుల్ వైరల్ గా జరుగుతుంది. మరి పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.
తెలుగు మరియు తమిళ సినిమా పరిశ్రమల మధ్య పోటీ దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. ఆ విధంగా కొనసాగుతుంటే లబ్ది చెందేది ప్రేక్షకులే. కాబట్టి పోటీ అనేది ఉండాల్సిందే. అసలు విషయంలోకి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్ 2' చిత్రం విడుదలైన తర్వాత తెలుగు వర్సెస్ తమిళ సినిమా సంగీత పోలికలు ఒక్కసారిగా తారస్థాయికి చేరాయి.
'జైలర్ 2' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం కేవలం నాలుగైదు రోజుల్లోనే ఏకంగా 400 నుంచి 500 కోట్ల రూపాయల భారీ కలెక్షన్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా కథాంశం పరంగా అక్కడక్కడా కొన్ని లోపాలు ఉన్నాయని కొందరు విమర్శించినప్పటికీ, అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం జైలర్ 2 ని మరో స్థాయికి తీసుకెళ్లాయని అందరూ ఏకగ్రీవంగా ప్రశంసిస్తున్నారు. సన్నివేశాల తీవ్రతకు తగినట్లు దర్శకుడు రాసిన మాస్ ఎలివేషన్లకు తోడు, అనిరుధ్ అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం సినిమా విజయానికి అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. కేవలం అనిరుధ్ మాత్రమే కాకుండా, సాయి అభ్యంకర్ లాంటి యువ సంగీత దర్శకులు సైతం తమ అద్భుతమైన పాటలు మరియు బీజీఎమ్‌తో తమిళ చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు.
ఇది కూడా చదవండి: తిట్టకుండా చేసింది ఎన్టీఆర్ నే: వైరల్ గా నిలుస్తున్న యష్!
మరోవైపు తెలుగు పరిశ్రమలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. టాలీవుడ్‌లో తమన్, దేవిశ్రీ ప్రసాద్ వంటి అగ్రశ్రేణి సంగీత దర్శకులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం వారి నుంచి వస్తున్న ట్యూన్లలో కొంతమేర రొటీన్ ఫార్ములా లేదా ఏకతానత (మోనాటనీ) కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చార్ట్‌బస్టర్ పాటలతో ఇండస్ట్రీని షేక్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్లు సైతమ ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ నటనపై దృష్టి పెట్టడం వల్ల సంగీతంపై కాస్త వేగం తగ్గించారు. దీనివల్ల చిరంజీవి, వెంకటేశ్ లాంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాలకు తమన్ ఒక్కడే దిక్కవుతున్నాడు. అయితే ఇటీవల వచ్చిన 'ఆదర్శ కుటుంబం' వంటి చిత్రాల పాటలపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ చూస్తుంటే, తెలుగు సంగీత దర్శకులు ఇంకాస్త గట్టిగా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది స్పష్టమవుతోంది.

తమిళంలో అనిరుధ్, సాయి అభ్యంకర్ నుండి వస్తున్న ప్రతి పాట సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుండగా, తెలుగులో మాత్రం మళ్లీ మళ్లీ వినాలనిపించేలాంటి మ్యాజిక్ చేయడం మన మ్యూజిక్ డైరెక్టర్లు కొంతవరకు తప్పుతున్నారు. అయితే ఈ లోపానికి కేవలం సంగీత దర్శకులు మాత్రమే కారణమా లేక వారికి తగినట్లుగా బలమైన సన్నివేశాలను దర్శకులు మలచలేకపోతున్నారా అనే ప్రశ్న కూడా ఇప్పుడు తీవ్రంగా ఉదయిస్తోంది. ఏది ఏమైనప్పటికీ, మారుతున్న కాలానికి అనుగుణంగా టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలు కేవలం పాత పేర్ల మీద ఆధారపడకుండా సరికొత్త ప్రయోగాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే సంగీత పరంగా తమిళ పరిశ్రమతో జరిగే ఈ పోరులో తెలుగు సినిమా వెనుకబడే ప్రమాదం ఉందని తెలుగు ట్రేడ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
[Telugu And Tamil Movie Music Comparison, Jailer 2 music, Telugu vs Tamil movies, Anirudh Ravichander, Tollywood vs Kollywood, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






