Home

»

Latest News

Irumudi: రవితేజ ఇరుముడిలో కొత్త హీరోయిన్.. గోల్డెన్ లెగ్ తన సొంతం 

Mar 11, 2026


-ఇరుముడిపై ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ 
-హిట్ కాదు సూపర్ హిట్ ఖాయమా! 
-గోల్డెన్ లెగ్ హీరోయిన్ కూడా ఉందా!

ఇక ఏ మాత్రం ఉపేక్షించేది లేదు.. హిట్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది.. అర్జెంటుగా సూపర్ హిట్ అందుకొని పబ్లిక్ లో హిట్  కుళ్ళికుళ్ళి ఏడ్చేలా చేస్తానని మాస్ మహారాజా 'రవితేజ'(Raviteja) చాలా గట్టిగానే ఫిక్స్ అయినట్టుగా ఉన్నాడు. ఇందుకు నిదర్శనమే అప్ కమింగ్ మూవీ 'ఇరుముడి'(Irumudi)నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు. అసలు రవితేజ ఏ ముహూర్తాన ఇరుముడికి ఓకే చెప్పాడో గాని ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్ ని తెచ్చుకోవడంతో పాటు ఎప్పడెప్పడు థియేటర్స్ లోకి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూ వస్తున్నారు. ప్రేక్షకుల మెంటల్ కండిషన్ కూడా సేమ్. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ న్యూస్ సోషల్ మీడియాకి అదనపు హంగుల్ని తెచ్చిపెడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

సుదీర్ఘ కాలం నుంచి భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన హవాని కొనసాగిస్తు వస్తున్న పాన్ ఇండియన్ భామ తమన్నా. అలాంటి తమన్నా ఇరుముడిలో మరో హీరోయిన్ గా ఎంపిక అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై అధికార ప్రకటన రానున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇదే కనుక నిజమైతే ఇరుముడికి ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ స్థాయి పెరిగినట్టే అని చెప్పవచ్చు. ఎందుకంటే తమన్నా గత కొంత కాలంగా గోల్డెన్ లెగ్ హోదాలో సినీ జర్నీని కొనసాగిస్తు వస్తుంది.స్పెషల్ సాంగ్స్ చేసినా చాలు ఆ మూవీ సూపర్ డూపర్ హిట్. అలాంటిది ఇప్పుడు రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఖాయమైతే ఇరుముడి పంట పండినట్టే. ఈ ఇద్దరు గతంలో 'బెంగాల్ టైగర్' మూవీలో జంటగా నటించారు.

also read: Mgr: తమిళుల ఆరాధ్య దైవం ఎంజిఆర్ పై నోరుజారిన రాజేంద్రప్రసాద్.. ఎందుకు మాట్లాడాడు

ఇరుముడిలో ఇప్పటికే తమిళ భామ 'ప్రియా భవాని శంకర్'(Priya Bhavani Shankar)ఒక హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే మేకర్స్ ఆమె లుక్ ని రివీల్ చేయగా హోమ్లీ క్యారక్టర్ లో ఉండటంతో పాటు రవితేజ వైఫ్ గా చేస్తున్న విషయం అర్ధమవుతుంది. ఈ నేపథ్యంలో తమన్నా ఉండటం ఫిక్స్ అయితే, తమన్నా రోల్ ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో ఉంది. మజిలీ, నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకుడు కాగా పాన్ ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com