Home

»

Latest News

Prabhas: మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తున్న ప్రభాస్!

Mar 11, 2026

  • ప్రభాస్ ని కలిసి 'ఎకో' దర్శకుడు
  • హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ సినిమా!

'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్(Prabhas).. తనతో సినిమాలు చేయడానికి ఎందరో స్టార్ డైరెక్టర్స్ రెడీగా ఉన్నా.. యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే సుజీత్, రాధాకృష్ణ కుమార్ వంటి పలువురు దర్శకులకు అవకాశమిచ్చాడు. ఇప్పుడు ఆ లిస్టులో మరో డైరెక్టర్ చేరేలా ఉన్నాడు.

'కక్ష: అమ్మినిప్పీళ్ల'తో దర్శకుడిగా పరిచయమైన మలయాళ డైరెక్టర్ దింజిత్ అయ్యతన్.. 'కిష్కింధ కాండం', 'ఎకో' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ దర్శకుడు ఇటీవల ప్రభాస్ ను కలవడం విశేషం. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

ప్రభాస్ తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన దింజిత్.. "సూపర్ స్టార్ ప్రభాస్ ని కలవడం సంతోషంగా ఉంది. గొప్ప సంభాషణలు, నవ్వులు, మంచి విందుతో నిండిన అద్భుతమైన సాయంత్రం ఇది. ప్రభాస్ సార్ కి, హోంబలే ఫిల్మ్స్ కు ధన్యవాదాలు." అని రాసుకొచ్చాడు.

గతంలో హోంబలే ఫిల్మ్స్, ప్రభాస్ తో మూడు సినిమాలను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ మూడు సినిమాలకు దర్శకులు ఎవరనేది అధికారికంగా చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ ని దింజిత్ కలవడం, హోంబలే ఫిల్మ్స్ కి థాంక్స్ చెప్పడం చూస్తుంటే.. వీరి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిందని అనిపిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

ప్రభాస్ ప్రస్తుతం 'ఫౌజి' షూటింగ్ లో బిజీలో ఉన్నాడు. 1940 నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాకు హను రాఘవపూడి దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

'ఫౌజి'తో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్', నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో 'కల్కి-2' సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. వీటి తర్వాత దింజిత్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందేమో చూడాలి.

Also Read: 'ఉస్తాద్ భగత్ సింగ్' సెన్సార్ రిపోర్ట్

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com