Home

»

Latest News

రణబాలి టీజర్: విజయ్ దేవరకొండ ఊచకోత.. మాస్ కంబ్యాక్ లోడింగ్.!

Sep 9, 2026 4:57PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎపిక్ మూవీ 'రణబాలి'. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా రిలీజ్ అయిన టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 

1876-78 కాలంలో బ్రిటీష్ వాళ్ల దారుణమైన పాలన, మద్రాస్ ప్రెసిడెన్సీలో వచ్చిన ఘోరమైన కరువు, ఆకలి చావులు... ఇవన్నీ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. "ఇది అన్నపూర్ణ దేశం రా... అన్నానికి కరువేంది?" అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే డైలాగ్ ప్రతి ఒక్కరి గుండెల్లో గుచ్చుకుంటుంది. బ్రిటీష్ ఆఫీసర్లు మన ధాన్యాన్ని దోచుకుంటూ, మన ప్రజలను బానిసలుగా మారుస్తుంటే... ఆ కరువు రాక్షసుడి ఆకలి తీర్చడానికి, మన నేల మీద నిలబడటానికి ఒక యోధుడు లేచాడు. ఆ యోధుడే సింగనమల బొబ్బిలి రణబాలి. 

రణబాలిగా  విజయ్ లుక్, ఆ బాడీ లాంగ్వేజ్, కళ్లల్లో కనిపిస్తున్న ఆ క్రోధం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తెల్లవాళ్ల తుపాకులకు, ఫిరంగిలకు భయపడకుండా, చేతిలో వేటకత్తి పట్టి ప్రత్యర్థుల తలలు తెగనరికే ఆ సీన్స్ టీజర్‌కే హైలైట్. "ఆ కొండ పైన ఉన్న మా భద్రమల్లాడి మీద ఆన.. ఒక్క మెతుకు కూడా పొలిమేర దాటనివ్వను" అంటూ విజయ్ చెప్పే డైలాగ్స్ అండ్ ఆ వాయిస్ బేస్ నెక్స్ట్ లెవల్ లో ఉంది.

అజయ్-అతుల్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి ఫ్రేమ్‌లో కనిపించే గ్రాండ్ నెస్, ఆ కాలం నాటి సెట్టింగ్స్ ఆకట్టుకున్నాయి,

విజయ్ దేవరకొండ మాస్ అవతార్, చారిత్రక కథాంశం, అద్భుతమైన విజువల్స్ చూస్తుంటే ‘రణబాళి’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

 

 

 

[Ranabaali Teaser, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Mythri Movie Makers, Ranabaali Movie, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com