Home

»

Latest News

సర్‌ప్రైజ్‌: 'శ్రీమతి'గా మారిన నివేదా థామస్.!

Sep 9, 2026 5:18PM

టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేదా థామస్ మళ్లీ మనందరి గుండెల్లో నిలిచిపోయే ఒక అద్భుతమైన ఫ్యామిలీ రోల్‌తో రాబోతున్నారు. '35 చిన్న కథ కాదు' సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించిన నివేదా, ఇప్పుడు ఓటీటీని షేక్ చేయడానికి సిద్ధమయ్యారు.

ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో రాబోతున్న సరికొత్త ఒరిజినల్ సిరీస్ 'శ్రీమతి'. ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌ను విశ్వక్ ఖండేరావు డైరెక్ట్ చేస్తున్నారు.

ప్రతి ఇంట ఉండే చిన్న చిన్న ఆనందాలు, వంటగది సెంటిమెంట్స్, బాధ్యతలు అన్నీ కలగలిపిన "ప్రతి ఇంటి కథ"గా ఈ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే మనకు హోమ్‌లీ ఫీలింగ్ కలుగుతుంది. పోస్టర్‌లో నివేదా థామస్ చాలా సంప్రదాయబద్ధంగా, చిరునవ్వుతో కనిపిస్తున్నారు. పోస్టర్ లో చుట్టూ కిచెన్ వాతావరణం, నెమలి డిజైన్లతో చాలా కలర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు.

నివేదా థామస్ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఎమోషనల్ అండ్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్‌ను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. ఇటీవల వచ్చిన '35 చిన్న కథ కాదు' సినిమాలో మధ్యతరగతి తల్లిగా ఆమె నటనకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఉత్తమ నటిగా తెలంగాణ గద్దర్ అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా ఎమోషనల్ డెప్త్ ఉన్న 'శ్రీమతి' అనే రిలేటబుల్ రోల్‌లో కనిపిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి.

కుటుంబ సమేతంగా కూర్చొని చూడదగ్గ ఫ్యూర్ ఎమోషనల్ డ్రామాగా 'శ్రీమతి' అలరించబోతోంది. విశ్వక్ ఖండేరావు మేకింగ్ స్టైల్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ వాల్యూస్ కలిస్తే ZEE5 లో మరొక క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ ఫస్ట్ లుక్ చూసి చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి.

 

 

[Srimathi First Look, Nivetha Thomas, Srimathi Web Series, ZEE5 Telugu Original, Vishvak Khanderao, Telugu Web Series, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com