Home

»

Latest News

నందమూరి మోక్షజ్ఞకి జోడీగా ఆ స్టార్ హీరోయిన్: ఈ హీరోయిన్ కూడా లిస్ట్ లో ఉంది

Sep 9, 2026 4:37PM

 

 

నందమూరి అభిమానులు, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ అభిమానులు కలలు ఫలించి    మోక్షజ్ఞ సెల్యులాయిడ్ పై ల్యాండ్ కావడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మేకర్స్  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కావడం, మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర తెరకెక్కిస్తున్న వశిష్ట దర్శకుడు కావడంతో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు . 

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో డ్యాన్స్, గ్లామర్‌తో కుర్రకారును ఊపేస్తున్న సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి.  శ్రీలీల అనే కాదు కానీ, ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు పలానా హీరోయిన్ ఓకే అంట కదా అని మాట్లాడుకుంటున్నారు. అభిమానులు మాత్రం శ్రీలీల అనే వార్తలపై స్పందిస్తూ శ్రీలీల  'భగవంత్ కేసరి'తో బాలయ్య బిడ్డగా చేసింది కదా అంటున్నారు. ఏది ఏమైనా మోక్షజ్ఞ సరసన కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ కూడా ఈ డెబ్యూ ప్రాజెక్టులో దాదాపు 20 నిమిషాల పాటు సాగే పవర్‌ఫుల్ మాస్ క్యామియో రోల్‌లో కనిపించనున్నారని,  థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని తెలుస్తోంది.

 

 

Also Read: రామాయణకి షాక్: ఆ మూవీతో పోటీ తప్పదా.. స్క్రీన్స్ విషయంలో అన్యాయం!

  దసరా పండగ సందర్భంగా అధికారికంగా లాంచ్ చేసి, నవంబర్ నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తోంది. ఏది ఏమైనా  "గుహని  వీడిన కూన, వేటకు సిద్ధమైన సింహంలా అడవిలోకి అడుగుపెడుతుండటంతో  పెద్దాయన ఎన్టీఆర్, బాలకృష్ణల నట వారసత్వాన్ని మోక్షజ్ఞ ఏ రీతిలో ముందుకు తీసుకెళ్తాడో చూడటానికి అభిమానులతో పాటు తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

 

 

[Mokshagna, Balakrishna, vasishta, Sreeleela, Mythri Movie Makers, Telugu Cinema, Telugu CinemaNews, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com