
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వాతంత్ర్యానికి ముందు రాయలసీమలో నెలకొన్న కరువు పరిస్థితులు, బ్రిటిష్ పాలనలో జరిగిన అరాచకాల నేపథ్యంతో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించారు. మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో సత్తా చాటింది.
విడుదలకు ముందు నుంచే భారీగా ప్రమోషన్స్ నిర్వహించిన ‘రణబాలి’ టీమ్.. సినిమా విడుదలైన తర్వాత కూడా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతోంది. ఇప్పుడు సినిమా విజయాన్ని అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమైంది.
‘రణబాలి రణభేరి’ పేరుతో ఈ సక్సెస్ మీట్‌ను అక్టోబర్ 23న అనంతపురంలో నిర్వహించనున్నారు. రాప్తాడు రోడ్డులోని హార్మోని సిటీలో సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక జరగనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
విజయ్ దేవరకొండకు రాయలసీమతో ప్రత్యేక అనుబంధం ఉంది. విజయ్ పుట్టపర్తిలోనే చదువుకున్నాడు. దీంతో అభిమానుల్లో ఈ వేడుకపై ఆసక్తి పెరిగింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన అభిమానులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. మరి ఈ ‘రణభేరి’ వేదికపై విజయ్ దేవరకొండ సినిమా విజయంపై ఏం మాట్లాడతారు? అభిమానులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: ప్రభాస్ కెరీర్లో టాప్ 10 సినిమాలు.. నంబర్ 1 ఏదో తెలుసా.?
[Ranabaali Success Meet, Ranabaali Ranabheri, Ranabaali Anantapur Event, Ranabaali Collections, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Ranabaali Box Office, Telugu Film News]






