
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అదేంటంటే.. ఈ సినిమాలో మహేశ్ బాబుకు బాడీ డబుల్‌గా పనిచేస్తున్న నటుడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మహేశ్ బాబుకు డూప్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి పేరు రోషన్ బొగాటి (బాల్). ముంబైకి చెందిన మోడల్, నటుడైన రోషన్ మిస్టర్ ఇండియా టైటిల్‌ను కూడా గెలుచుకున్నట్లు సమాచారం. హిందీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆయన.. తెలుగులో ‘పాడేరు 12వ మైలు’, ‘యమునా నది’, ‘పెన్ డ్రైవ్’ వంటి చిత్రాల్లోనూ కనిపించారు.
గతంలో మహేశ్ బాబు నటించిన మౌంటెన్ డ్యూ ప్రకటనలోనూ ఆయనకు డూప్‌గా రోషన్ పనిచేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ‘వారణాసి’ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలను రోషన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో ఆయన పేరు నెట్టింట వైరల్ అవుతోంది. అతని ప్రొఫైల్ లో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, ఫైట్ మాస్టర్ తదితరులతో కలిసి దిగిన పిక్స్ ఉన్నాయి.
భారీ యాక్షన్ సన్నివేశాలు, రిస్క్‌తో కూడిన స్టంట్స్, కొన్ని షోల్డర్ షాట్స్ వంటి సందర్భాల్లో బాడీ డబుల్స్‌ను ఉపయోగించడం సినిమా నిర్మాణంలో సాధారణమే. నటీనటుల భద్రతతో పాటు సన్నివేశాలను అనుకున్న విధంగా చిత్రీకరించడంలో వీరు కీలకంగా ఉంటారు. అయితే, ‘వారణాసి’లో రోషన్ ఏయే సన్నివేశాల్లో మహేశ్‌కు డూప్‌గా నటించారనే వివరాలు మాత్రం బయటకు రాలేదు.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్ మూవీలో మహేశ్ బాబు రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్, అడ్వెంచర్, పురాణ అంశాలు, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: ప్రభాస్ కెరీర్లో టాప్ 10 సినిమాలు: నంబర్ 1 ఏదో తెలుసా.?
[Mahesh Babu Body Double in Varanasi, Varanasi Movie, Mahesh Babu Body Double, Roshan Bogati, Mahesh Babu, SS Rajamouli, Priyanka Chopra, Telugu Film News]






