
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే ఓజి 2 లో పాల్గొంటాడనే న్యూస్ చాలా రోజుల నుంచి కాన్ఫిడెన్స్ గానే సోషల్ మీడియాలో, సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూ ఉంది. దీంతో ఆ ఘడియల కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక దుష్ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే, తాజాగా ఒక వాట్సాప్ గ్రూప్‌లో, నకిలీ ఛానళ్లలో పవన్ కల్యాణ్ తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నారంటూ వచ్చిన ఒక తప్పుడు వార్త రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం సృష్టించింది. ఏమాత్రం నిజానిజాలు నిర్ధారించుకోకుండా, కేవలం సంచలనం కోసం లేదా తొందరపాటు కారణంగా ఒక వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ చేసిన పోస్ట్ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
ఈ పరిణామంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ నడిచింది. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ గుర్తింపును, నాయకుల పేర్లను దుర్వినియోగం చేస్తూ ఫేక్ ఛానెళ్లు, ఫేక్ గ్రూపులు సృష్టిస్తున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యుల ఆట కట్టిస్తామని తేల్చిచెప్పడంతో సోషల్ మీడియా నిర్వాహకుల్లో ఒక్కసారిగా వణుకు మొదలైంది.
ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తీవ్ర భయాందోళనకు గురైన ఆ సంబంధిత వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ తన తప్పును తెలుసుకుని బహిరంగంగా క్షమాపణలు కోరారు. ఉదయం పూట గ్రూప్‌లో పవన్ కల్యాణ్ రాజీనామా అంటూ వచ్చిన ఒక పోస్ట్‌ను తాను సోషల్ మీడియాలో చూసి, కనీసం గ్రౌండ్ రియాల్టీ ఏంటో తెలుసుకోకుండా, ఏమాత్రం బాధ్యత లేకుండా ఫార్వర్డ్ చేసినట్లు అడ్మిన్ తన వివరణలో పేర్కొన్నారు. ఆ వార్త పూర్తిగా అవాస్తవమని, కేవలం ఫేక్ న్యూస్ అని ఆ తర్వాతే తనకు అర్థమైందని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం కార్యాలయం దీనిపై తీవ్రంగా స్పందించి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించడంతో తన తప్పు ఏ స్థాయి ఉందో గ్రహించినట్లు తెలిపారు. పవన్ కల్యాణ్, జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు, అటు గ్రూప్ సభ్యులందరికీ తన హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎటువంటి వార్తను ఫార్వార్డ్ చేసినా, పోస్ట్ చేసినా అది నిజమైనదా కాదా అని అధికారిక వర్గాల ద్వారా పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే ముందుకు వెళ్తానని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు సమాచారాన్ని వేగంగా చేరవేయడంలో ఎంత ముందుంటాయో, అదే వేగంతో తప్పుడు వార్తలను వ్యాప్తి చేసి సమాజంలో అశాంతిని రేకెత్తించడంలో కూడా అంతే ప్రమాదకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రముఖులపై ఇలాంటి నకిలీ వార్తలు సృష్టించడం చట్టరీత్యా తీవ్రమైన నేరం.
ఇది కూడా చదవండి: సావిత్రి, శ్రీదేవి ఆల్రెడీ పెళ్లి అయిన వ్యక్తులని ఎలా పెళ్లి చేసుకున్నారు: మెయిన్ రీజన్ ఇదే!

ఈ ఘటనతో సోషల్ మీడియా అడ్మిన్లు, వాట్సాప్ గ్రూప్ నిర్వాహకులు అందరూ తీవ్రమైన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కేవలం వ్యూస్ కోసం, లైకుల కోసం లేదా గ్రూప్‌లో యాక్టివ్‌గా ఉండాలనే దురాశతో వచ్చే ప్రతి వార్తకు బలైపోకుండా, ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. పవన్ కల్యాణ్ కార్యాలయం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఫేక్ న్యూస్ క్రియేటర్లకు మరియు బాధ్యతారహితంగా వ్యవహరించే వాట్సాప్ అడ్మిన్లకు ఒక బలమైన హెచ్చరికగా నిలిచింది. డిజిటల్ యుగంలో స్వేచ్ఛ పేరుతో ఇతరుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే చట్టం తన పని తాను కచ్చితంగా చేసుకుపోతుందనేందుకు ఈ ఉదంతం ఒక నిదర్శనంగా నిలిచింది. బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా నిబంధనలను పాటించాలని, ఫేక్ వార్తలను షేర్ చేయకుండా నిరోధించాలని ఈ సంఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
[whatsapp Admin Apology To Pawan kalyan, Pawan Kalyan Latest News, Deputy CM Pawan Kalyan, WhatsApp Admin Apology, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]






