Home

»

Latest News

మైత్రి ఇన్ లవ్‌: శ్రీకాంత్‌ కుమార్తె సినిమాతో రామజోగయ్య శాస్త్రి తనయుడి ఎంట్రీ.!

Oct 13, 2026 7:22PM

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీలు కొత్తేమీ కాదు. ఇప్పటికే పలువురు నటీనటుల పిల్లలు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడు ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ కుమార్తె మేధ మేకా హీరోయిన్‌గా పరిచయమవుతున్న సినిమాతో మరో వారసుడు కూడా సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తనయుడు సాయి హర్ష సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.

శ్రీకాంత్‌ కుమార్తె మేధ మేకా ‘మైత్రి ఇన్ లవ్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మేధ సినీ ప్రయాణంపై ఇప్పటికే ఆసక్తి నెలకొనగా.. ఇప్పుడు ఈ సినిమాలో మరో ప్రత్యేకత కూడా చేరింది.

ఈ చిత్రంతో రామజోగయ్య శాస్త్రి కుమారుడు సాయి హర్ష సంగీత దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. దీంతో ఒకే సినిమాతో ఇద్దరు సినీ వారసులు తమ కెరీర్‌ను ప్రారంభించబోతుండటం విశేషం.

తన కుమారుడి సినీ రంగ ప్రవేశం గురించి రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న చిత్రంతో సాయి హర్ష తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడని తెలిపారు. సంగీతంపై అతనికి ఎంతో మక్కువ ఉందని, వినయం, అణకువతో మెలిగే తన కుమారుడికి అందరి ఆశీర్వాదాలు కావాలని కోరారు.

ఇన్నాళ్లూ ఎన్నో విజయవంతమైన పాటలతో ప్రేక్షకులను అలరించిన రామజోగయ్య శాస్త్రి.. ఇప్పుడు తన కుమారుడిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తుండటంతో ఈ ఎంట్రీపై ఆసక్తి పెరిగింది.

ఇది కూడా చదవండి: లోకేష్ కనగరాజ్‌ DC.. మరో ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.!

 

 

 

[Ramajogaiah Sastry Son As Music Director, Ramajogaiah Sastry Son Sai Harsha, Srikanth Daughter Medha Meka, Mythri In Love, Mythri Movie Makers, Medha Meka, Sai Harsha, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com