
తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ నటుడిగా మారి నటించిన సినిమా ‘DC’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికే థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. ఇప్పుడు మరో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి రాబోతోంది. అక్టోబర్ 16 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన ‘DC’ను సోనీ లివ్ ఐదు భాషల్లో అందుబాటులోకి తీసుకురానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అక్టోబర్ 16 నుంచి ఈ సినిమాను చూడొచ్చు.
ప్రేమ, నమ్మకద్రోహం, ప్రతీకారం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా తెరకెక్కింది. దేవదాస్ అలియాస్ దాస్ పాత్రలో లోకేష్ కనగరాజ్ కనిపించగా.. చంద్ర పాత్రలో వామికా గబ్బి నటించింది. సంజనా కృష్ణమూర్తి, కస్తూరి రాజా, తలైవాసల్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఆయుధాల దోపిడీ కేసులో జైలుకు వెళ్లిన దేవదాస్.. అక్కడ సర్కార్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంటాడు. ఆ తర్వాత అతని బృందంతో కలిసి పనిచేయడం మొదలుపెడతాడు. ఓ దోపిడీ కేసులో పోలీసుల వెంటాడటం, ఓ పోలీస్ అధికారి హత్య తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టంగా మారడం కథలో కీలక మలుపులు. ఈ క్రమంలో దేవదాస్ జీవితంలోకి వచ్చే చంద్ర అతడిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అతని లక్ష్యం ఏమిటి? అన్నది సినిమాలో ఆసక్తికరంగా చూపించారు.
ఇది కూడా చదవండి: రాజాసాబ్ రిజల్ట్‌తో సంబంధం లేదు.. ప్రభాస్‌తో మరో సినిమా ఫిక్స్.!
[DC Movie OTT Release, DC OTT Release, DC OTT Telugu, DC SonyLIV, Lokesh Kanagaraj, Wamiqa Gabbi, Arun Matheswaran, Telugu Movies OTT, Telugu Film News]






