Home

»

Latest News

నితిన్ అలియాస్ రుక్మిణి హీరోయిన్ ఈ భామనే: మీరు ఊహించిన ముద్దుగుమ్మ అయితే కాదు! 

Oct 13, 2026 7:27PM


హమ్మయ్య..ఎట్టకేలకు అభిమానుల ఎగ్జైట్ మెంట్ కి ఎండ్ కార్డు పడింది. నితిన్, నాచురల్ స్టార్ నాని కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'అలియాస్ రుక్మిణి'కి  సంబంధించిన హీరోయిన్ పేరుని  చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించేసింది.


 బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్‌వాలా మేనకోడలు అయిన యువ నటి ఆఫియా సయ్యద్‌ను ఈ చిత్రంలో 'రుక్మిణి' పాత్రకు పరిచయం చేస్తూ అఫీషియల్ వీడియోని విడుదల చేశారు. ఈవిడ చాలా స్ట్రిక్ట్ అండోయ్ అంటూ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతూ ఉంది.  ఆఫియా సయ్యద్‌ స్కూల్ టీచర్ అనే విషయం వీడియో ద్వారా అర్ధమవుతుంది. మొత్తం 55 సెకన్లు ఉన్న వీడియోలో స్కూల్ పిల్లలకి ఆఫియా  వార్నింగ్ ఇవ్వడం, తన లుక్స్ కేక.


ఇది కూడా చదవండి: విజయవాడ కనకదుర్గమ్మ కొండపై జోసఫ్ విజయ్!

 


'దండోరా' వంటి విభిన్న చిత్రంతో తన సత్తా చాటిన టాలెంటెడ్ డైరెక్టర్ మురళీకాంత్ దేవసోత్ తెరకెక్కిస్తుండగా  ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు మరియు చిన్నపాటి క్లూస్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. సంగీత దర్శకుడిగా విజయ్ బుల్గానిన్ వ్యవహరిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను జోమోన్ టీ. జాన్ పర్యవేక్షిస్తున్నారు.  డిసెంబర్ 4 రిలీజ్ డేట్.

 

[Aafiya Sayed As Rukmini, Aafiya Sayed, Alias Rukmini, Nithiin Nani movie, Tollywood debut, Aafiya Sayed Rukmini, December 4 release, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com