
తలైవా రజినీకాంత్ మరోసారి జైలర్ 2 తో హే.. టైగర్ కా హుకుం అంటూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ 541 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు. ఇది కేవలం ఆరురోజులకే. దీన్ని బట్టి రజినీ స్టైల్ కి సెల్యులాయిడ్ ఎంత షేక్ అవుతుందో తెలిసింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో రజినీ తన యావదాస్తిని సేవా కార్యక్రమాలకి ఇస్తున్నారని, కుటుంబానికి ఏమీ ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతుంది.
నిజానికి ఇది ఓల్డ్ న్యూస్.. ఆ ఓల్డ్ న్యూస్ ప్రకారం అసలు నిజం ఏంటంటే రజినీ చెన్నైలోని కోడంబాక్కంలో నిర్మించిన రాఘవేంద్ర కల్యాణ మండపం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజాసేవకు వినియోగిస్తానని మాత్రమే గతంలో ఆయన ఒక వీడియో ద్వారా స్వయంగా చెప్పాడు. అయితే, ఈ వ్యాఖ్యలను వక్రీకరించి, తన యావదాస్తిని సేవా కార్యక్రమాలకు ఇస్తున్నారని, కుటుంబానికి ఏమీ ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
సుమారు ఎకరంన్నర విస్తీర్ణంలో ఉన్న ఆ మండపాన్ని తన తదనంతరం రాఘవేంద్ర పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్‌కు చెందేలా వీలునామా రాశానని ఆయన అప్పట్లో తెలిపారు. దాని ద్వారా వచ్చే ఆదాయంలో ఒక్క పైసా కూడా తన కుటుంబానికి వెళ్లకూడదని, అది పూర్తిగా ప్రజల కోసమే వినియోగించాలని స్పష్టం చేశారు.
.webp)
టికెట్లు కొని తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన తమిళ ప్రజలకు ఏదైనా తిరిగి చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రజనీకాంత్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన భార్య లత, కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నానని కూడా వివరించారు.
[Rajinikanth Sensational Decision To donate entire property to charity, rajinikanth about his property to charity, rajinikanth jailer 2 collections, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






