
టాలీవుడ్‌లో వరుస పెళ్లి వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి వార్తలు వైరల్ అవుతున్న సమయంలోనే.. ఇప్పుడు ‘హనుమాన్’ ఫేమ్ తేజ సజ్జా కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనే ప్రచారం మొదలైంది. నవంబర్‌లో నిశ్చితార్థం, డిసెంబర్‌లో వివాహం జరగనుందని టాక్ వినిపిస్తోంది. దీంతో తేజ సజ్జా చేసుకోబోయే అమ్మాయి ఎవరనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
తేజ సజ్జా పెళ్లికి సంబంధించి ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆయనది పెద్దలు కుదిర్చిన వివాహమట. వధువు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని, ఆమె కుటుంబానికి సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని ప్రచారం జరుగుతోంది. అంటే గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండే అమ్మాయితో తేజ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడన్నమాట.
నవంబర్‌లో నిశ్చితార్థం నిర్వహించి, డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహ వేడుక జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారని సమాచారం. అయితే, వధువు పేరు, నిశ్చితార్థం తేదీ, పెళ్లి తేదీపై అధికారిక వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
ఇది కూడా చదవండి: సాయి ధరమ్ తేజ్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. వధువు ఎవరో తెలుసా.?

[Teja Sajja Wedding, Teja Sajja Marriage, Teja Sajja Engagement, HanuMan Actor Wedding, Teja Sajja, Sai Dharam Tej, Telugu Film News]






