
కె. రాఘవేంద్ర రావు.. తెలుగు సినిమాకి, సాంగ్స్ కి రిపీట్ ఆడియెన్స్ ని పర్మినెంట్ నంబర్స్ గా మార్చిన దర్శకేంద్రుడు.. స్క్రీన్ పై హీరో పేరు కనపడితే ఎలా అయితే విజిల్స్ మోగుతాయో, రాఘవేంద్ర రావు అనే పేరు కనపడినా అదే సిట్యువేషన్. తెలుగు సినిమా మణిహారం కూడా అయిన రాఘవేంద్రరావు కొన్ని రోజుల నుంచి ఎలాంటి సినిమా ప్రకటన చెయ్యలేదు.
కానీ రాఘవేంద్రరావు రీసెంట్ గా విజయవాడలో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్ 2.0 కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హీరోగా సినిమా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ కార్యక్రమాన్ని చూసిన తర్వాత నా మనసులో ఓ కథ మెదిలిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సాధారణంగా స్టార్ హీరోలు, యువ నటులతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు రాఘవేంద్రరావు ఇప్పుడు కేంద్ర మంత్రితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమా ఎలాంటి కథతో రూపొందుతుంది? పెమ్మసాని చంద్రశేఖర్ నిజంగా హీరోగా నటించేందుకు ముందుకు వస్తారా? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: టైగర్ ష్రాఫ్ పై రివాల్వర్ తో కాల్పులు: చేసింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
.webp)
గుంటూరు ఎంపీ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ సెంట్రల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ మంత్రిగా ఉన్నారు.
[Raghavendra Rao About He will make a film with the union minister, Raghavendra Rao movie, Union Minister film, K Raghavendra Rao latest news, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu news]





