Home

»

Latest News

ఎన్టీఆర్ సాయం కోరిన రామచంద్ర.. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న కమెడియన్.! 

Oct 18, 2026 7:23PM

సినిమాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన నటుడు రామచంద్ర ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు పలు చిత్రాల్లో హాస్య పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. బ్రెయిన్ ట్యూమర్, పక్షవాతం కారణంగా చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువ హీరో సంజోష్ ఆయనకు అండగా నిలిచారు. రామచంద్రను పరామర్శించడంతో పాటు తన వంతుగా రూ.15 వేల ఆర్థిక సాయం అందించారు. కష్టాల్లో ఉన్న తోటి కళాకారుడికి సహాయం చేయడంతో సంజోష్‌పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 

రామచంద్ర చికిత్సకు ఇంకా సుమారు రూ.8 లక్షలు అవసరమని తెలుసుకున్న సంజోష్.. ఆయనకు మరింత ఆర్థిక సాయం అందేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన పరిస్థితిని జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని రామచంద్ర కోరినట్లు సమాచారం. దీనిపై స్పందించిన సంజోష్.. ఈ విషయాన్ని ఎన్టీఆర్ అన్నకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. అయితే ఎన్టీఆర్ నుంచి సాయం అందినట్లు ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. 

ఇక రామచంద్ర విషయానికి వస్తే.. ర‌వితేజ‌ నటించిన ‘వెంకీ’ సినిమాలో బుజ్జి పాత్రతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ‘దుబాయ్ శీను’, ‘సొంతం’, ‘దరువు’ వంటి చిత్రాల్లోనూ హాస్య పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. ఒకప్పుడు తెరపై తన కామెడీతో నవ్వులు పంచిన నటుడు ఇప్పుడు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుండటం అభిమానులను కలచివేస్తోంది. 

ప్రస్తుతం రామచంద్ర చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం అందితే ఆయనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, ఇతర ప్రముఖులు ముందుకొచ్చి ఆదుకోవాలని సంజోష్ విజ్ఞప్తి చేశారు. రామచంద్ర త్వరగా కోలుకుని మళ్లీ ఆరోగ్యంగా మారాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఆయనకు మరింత సాయం అందించేందుకు ఇంకెంతమంది ముందుకొస్తారో చూడాలి.

 


[Comedian Ramachandra, Hero Sanjosh, Ramachandra Health Update, Junior NTR Help, Ramachandra Financial Aid, Venky Movie Comedian, Telugu Comedian News, Sanjosh Financial Help]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com