
ముంబైలోని జుహు ప్రాంతంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ ని లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఊహించని పరిణామంతో బాలీవుడ్ వర్గాల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ దురాఘాతానికి తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అనిల్ పండిత్ ముందుకు రావడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి భద్రతా సంస్థలకు చేరిన ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ అరాచకానికి తెరలేపిన అనిల్ పండిత్ ఎవరు, అతని నేపథ్యం ఏమిటనే దానిపై ముంబై పోలీసులు మరియు ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్రంగా ఆరా తీస్తున్నాయి.
అనిల్ పండిత్ గతంలో భారతదేశం నుంచి వెళ్ళిపోయే వరకు ఎలాంటి క్రిమినల్ కేసులు లేని సాధారణ వ్యక్తిగా ఉండేవాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే, కాలక్రమేణా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో సంబంధాలు ఏర్పరచుకున్నాక అతని జీవితం పూర్తిగా మారిపోయింది. దాదాపు ఎనిమిది నెలల క్రితం రణ్‌దీప్ మాలిక్ అనే మరో గ్యాంగ్ సభ్యుడి స్థానంలో అనిల్ పండిత్ ఈ జాబితాలోకి ప్రవేశించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత అతనిపై వరుసగా పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అమెరికా నుంచి ఆపరేట్ చేస్తున్న హరీశ్ చంద్ర జాట్ అలియాస్ హారీ బాక్సర్ అనే హ్యాండ్లర్ కింద అనిల్ పండిత్ పనిచేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ హారీ బాక్సర్‌పై ఇప్పటికే రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో దోపిడీలు, బలవంతపు వసూళ్లు, హత్యాయత్నాలకు సంబంధించి అనేక కేసులు నమోదై ఉన్నాయి.
టైగర్ ష్రాఫ్‌పై జరిగిన ఈ దాడి కేవలం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నది కాదని, బాలీవుడ్ పరిశ్రమ మొత్తం హెచ్చరికలను జారీ చేయడమేనని ఆడియో క్లిప్ ద్వారా స్పష్టమైంది. తాము చెప్పిన మాట వినకుండా సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేస్తున్నందువల్లనే టైగర్ ష్రాఫ్‌ను టార్గెట్ చేసినట్లు అనిల్ పండిత్ ఆ ఆడియోలో పేర్కొన్నాడు. "ఇది మా మొదటి మరియు చివరి హెచ్చరిక" అంటూ ఆయన బాలీవుడ్ నటులను, సల్మాన్ ఖాన్‌తో సంబంధం ఉన్న ఎవరినైనా సరే వదిలిపెట్టబోమని బహిరంగంగానే బెదిరింపులకు దిగాడు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఆయన కారుపై ముగ్గురు దుండగులు జరిపిన మూడు రౌండ్ల కాల్పులు ముంబైలో శాంతిభద్రతల పరిస్థితిపై పెద్ద ప్రశ్నార్థకాన్ని లేవనెత్తాయి.
ఇది కూడా చదవండి: కేంద్రమంత్రితో రాఘవేంద్రరావు సినిమా: ఆసక్తికర సబ్జెక్ట్!

ఈ ఉదంతంపై అటు మహారాష్ట్ర ప్రభుత్వం, ఇటు ముంబై పోలీసులు అత్యంత సీరియస్‌గా స్పందించారు. నటుడు సల్మాన్ ఖాన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు రావడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గతంలోనూ పంజాబీ గాయకుడు గురు రంధావాల జిమ్‌పై, దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వెలుపుల జరిగిన కాల్పుల ఘటనలతో ఈ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు అదే కోవలో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరగడం, అనిల్ పండిత్ తెరపైకి రావడం సినీ పరిశ్రమబి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసులో తదుపరి విచారణ వేగవంతం చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలని మరింత ముమ్మరం చేశారు.
[Anil Pandit About Tiger shroff, Tiger Shroff firing, Who is Anil Pandit, Lawrence Bishnoi gang, Salman Khan threat, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu news]






